రాఘవేంద్రరావు సినిమాలలో హీరోయిన్స్ పాత్రలకి ఎంతవరకూ ప్రాధాన్యత ఉంటుందనే విషయం అటుంచితే, ఆయన సినిమాలలో వాళ్లు మరింత గ్లామరస్ గా కనిపిస్తూ ఉంటారు. అందువల్లనే అప్పట్లో ప్రతి హీరోయిన్ కూడా ఆయన దర్శకత్వంలో ఒక్క సినిమా అయినా చేయాలనే ఆశతో .. ఆలోచనతో ఉండేవారు. అలాంటి దర్శకుడు ఎంపిక చేసిన హీరోయిన్ గా శ్రీలీల ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ అడుగుపెట్టిన దగ్గర నుంచి ఇక ఆమె వెనుదిరిగి చూసుకోలేదు.
శ్రీలీల వరుస అవకాశాలను అందుకుంటూ వెళుతుందని అంతా అనుకున్నారు. నిన్న ఆమె బర్త్ డే సందర్భంగా, ఆయా ప్రాజెక్టుల నుంచి వదిలిన స్పెషల్ పోస్టర్లు చూసి, కొత్తగా వచ్చిన మిగతా హీరోయిన్స్ కి కళ్లు తిరిగి ఉంటాయి. ప్రస్తుతం ఆమె చేస్తున్నావే ఏడు సినిమాల వరకూ ఉన్నాయి. మరికొన్ని కథలు చర్చల దశలో ఉన్నాయి. వీటిలో ఏదీ చిన్న ప్రాజెక్టు కాదు .. తీసిపారేసే సినిమా లేదు. దాంతో అంతా ‘ఔరా’ అనుకున్నారు.
శ్రీలీల చేస్తున్న ఈ సినిమాలలో కొన్ని ఈ ఏడాదిలో … మరికొన్ని వచ్చే ఏడాదిలో విడుదల కానున్నాయి. అందువలన ఈ రెండేళ్లు ఆమె హవా కనిపించడం ఖాయంగానే అనిపిస్తోంది. కొత్తగా వచ్చిన ఒక బ్యూటీకి ఈ స్థాయిలో వరుస సినిమాలు పడటం .. ఇలాంటి బ్యానర్లలో పడటం నిజంగా అదృష్టంగానే చెప్పుకోవాలి. శ్రీలీల గ్లామర్ .. ఆమె ఫిజిక్ .. డాన్సులలోను దున్నేయడం ఆమె ఎంపికకి ప్రధానమైన కారణాలుగా కనిపిస్తున్నాయి. ఇక ఆ తరువాత వచ్చిన అరడజను మంది కొత్త హీరోయిన్స్ ను ఫ్లాపులు పలకరించడం కూడా శ్రీలీలకి కలిసొచ్చిందని చెప్పుకోవాలి.