Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్ఐపీఎల్: కోల్ కతాపై హైదరాబాద్ ఘనవిజయం

ఐపీఎల్: కోల్ కతాపై హైదరాబాద్ ఘనవిజయం

SRH Hattrick: హైదరాబాద్ బ్యాట్స్ మెన్ రాహుల్ త్రిపాఠి; ఎడెన్ మార్ క్రమ్ రాణించడంతో ఐపీఎల్ లో నేడు జరిగిన మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ పై హైదరాబాద్ సన్ రైజర్స్ 7వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. రాహుల్ త్రిపాఠి 37 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 71; మార్ క్రమ్ 36 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో నాటౌట్ గా నిలిచి హైదరాబాద్ కు అద్భుత విజయం సాధించారు.

ముంబై లోని బ్రాబౌర్న్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో హైదరాబాద్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కోల్ కతా 31 పరుగులకే మూడు వికెట్లు (వెంకటేష్ అయ్యర్-6; ఆరోన్ పించ్-7; సునీల్ నరేన్-6) కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 28 పరుగులు చేసి ఔటయ్యాడు. నితీష్ రానా 36 బంతుల్లో, 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 54; ఆండ్రీ రస్సెల్  25 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 49 నాటౌట్ గా నిలవడంతో కోల్ కతా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 175 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్ మూడు; ఉమ్రాన్ మాలిక్ రెండు; భువీ, మార్కో జేన్సెన్, జగదీశ సుచిత్ తలా ఒక వికెట్ తీసుకున్నారు.

తర్వాత బ్యాటింగ్ హైదరాబాద్ మొదలు పెట్టిన హైదరాబాద్ మూడు పరుగులకే మొదటి వికెట్ (అభిషేక్ శర్మ-3) వికెట్ కోల్పోయింది. కెప్టెన్ విలియమ్సన్ కూడా 17 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. ఈ దశలో రాహుల్ త్రిపాఠి- మార్ క్రమ్ లు మూడో వికెట్ కు 94 పరుగులు జోడించి విజయానికి బాటలు వేశారు.

త్రిపాఠి ఔటైన తర్వాత మార్ క్రమ్ సిక్సర్లు, ఫోర్లతో మోత మోగించాడు. దీనితో మరో 13 బంతులు మిగిలి ఉండగానే హైదరాబాద్ విజయ ఢంకా మోగించింది.

రాహుల్ త్రిపాఠికి  ’ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ లభించింది.

Also Read : ఐపీఎల్: రాజస్తాన్ పై గుజరాత్ ఘనవిజయం

RELATED ARTICLES

Most Popular

న్యూస్