Sunday, May 19, 2024
Homeస్పోర్ట్స్IPL: సన్ రైజర్స్ రికార్డుల మోత: 287/3

IPL: సన్ రైజర్స్ రికార్డుల మోత: 287/3

సన్ రైజర్స్ హైదరాబాద్ మరోసారి రికార్డుల మోత మోగించింది.  ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరు నమోదు చేసింది. ఈ సీజన్ లోనే ముంబై ఇండియన్స్ తో హైదరాబాద్ లో జరిగిన మ్యాచ్ లో 277 పరుగులు చేసి ఐపీఎల్ లో 2013 నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు పేరిట కొనసాగుతున్న హయ్యస్ట్ స్కోరు 263ను బద్దలు కొట్టిన హైదరాబాద్ నేడు బెంగుళూరు తో జరిగిన మ్యాచ్ లో తన రికార్డును తానే తిరగరాసి 287 రన్స్ చేసింది. టి 20 చరిత్రలో ఇది రెండో అత్యధిక స్కోరు. ఐపీఎల్ ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సర్లు(22) సాధించిన రికార్డు కూడా హైదరాబాద్ సాధించింది. ఫోర్ల కంటే సిక్సర్లు ఎక్కువగా రాబట్టడం విశేషం, సిక్సర్లు 22 అయితే 19 ఫోర్లు సాధించారు. పవర్ ప్లే లో అత్యధిక పరుగులు (81) సాధించిన రికార్డు కూడా సన్ రైజర్స్ తన పేరిట లిఖించుకుంది.

బెంగుళూరు చిన్న స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకుంది. తొలి ఓవర్లో అభిషేక్ ఏడు పరుగులు సాధించగా  రెండో ఓవర్ నుంచి ఎదురుదాడి మొదలుపెట్టి బెంగుళూరు బౌలర్లను చితక బాదారు. తొలి వికెట్ కు 8.1 ఓవర్లలో 108 పరుగులు చేశారు.

ట్రావిస్ హెడ్ 41 బంతుల్లో 9 ఫోర్లు 8 సిక్సర్లతో 102;  హెన్రిచ్ క్లాసేన్ 31 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్సర్లతో 67; అభిషేక్ శర్మ 22 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 34 పరుగులు చేసి ఔట్ కాగా, ఏడెన్ మార్ క్రమ్ 17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 32; అబ్దుల్ సమద్ 10 బంతుల్లోనే 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 రన్స్ తో నాటౌట్ గా నిలిచారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్