పురుషుల టి 20 వరల్డ్ కప్ లో నేడు జరిగిన తొలి మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ పై శ్రీలంక 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. బ్రిస్బేన్ లోని గబ్బా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఆఫ్ఘన్లు ఇచ్చిన 145 పరుగుల విజయ లక్ష్యాన్ని 18.3 ఓవర్లలో నాలుగు వికెట్లు మాత్రమె కోల్పోయి శ్రీలంక ఛేదించింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘన్ జట్టులో ఓపెనర్లు తొలి వికెట్ కు 42 పరుగులు చేశారు. రహ్మతుల్లా గుర్జాబ్-28; ఉస్మాన్-27; ఇబ్రహీం జార్డాన్-22; నజీబుల్లా-18 పరుగులతో ఫర్వాలేదనిపించారు. మిడిలార్డర్, టెయిలెండర్లు విఫలం కావడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 144 పరుగులు చేసింది.
లంక బౌలర్లలో వానిందు హసరంగ మూడు; లాహిరు కుమార రెండు; రజిత, ధనంజయ డిసిల్వా చెరో వికెట్ పడగొట్టారు.
బ్యాటింగ్ మొదలు పెట్టిన లంక 12 పరుగులకే తొలి వికెట్ (పాతుమ్ నిశాంక-10) కోల్పోయింది. మరో ఓపెనర్ కుశాల్ మెండీస్ కూడా 25పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాతా ధనంజయ డిసిల్వా- చారిత్ అసలంక మూడో వికెట్ కు 54 పరుగులు చేసింది. చరిత్-19, భానుక రాజపక్ష -18 పరుగులు చేసి ఔటయ్యారు. డిసిల్వా 42 బంతుల్లో 6 ఫోర్లు, 2 వికెట్లు 66 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు.
ముజీబ్ ఉర్ రెహ్మాన్, రషీద్ ఖాన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
వానిందు హసరంగ కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ లభించింది.
Also Read : ICC Men’s T20 World Cup 2022: ఐర్లాండ్ పై ఆసీస్ విజయం