Thursday, March 28, 2024
Homeస్పోర్ట్స్Asia Cup: సూపర్ 4కు శ్రీలంక

Asia Cup: సూపర్ 4కు శ్రీలంక

ఆసియ కప్ క్రికెట్ లో శ్రీలంక సూపర్ 4కు చేరుకుంది. మొదటి మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ చేతిలో అనూహ్యంగా ఓటమి పాలైన లంక నేడు బంగ్లాదేశ్ తో జరిగిన హోరాహోరీ పోరులో మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించి టాప్ 4 లో చోటు ఖాయం చేసుకుంది.  బంగ్లాదేశ్ విసిరిన 184  పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన  లంక జట్టులో బ్యాట్స్ మెన్ కుశాల్ మెండీస్-60 (37బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు); కెప్టెన్ శనక-45(33 బంతుల్లో 3 ఫోర్లు, 2సిక్సర్లు) పరుగులతో రాణించారు. చివర్లో అషిత ఫెర్నాండో మూడు బంతుల్లో రెండు ఫోర్లతో 10 పరుగులు చేసి అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు.

దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బంగ్లా బ్యాట్స్ మెన్ మెహిదీ హాసన్-38; అఫిఫ్ హోస్సేన్-39; మహ్మదుల్లా-27; మోసాద్దేక్ హుస్సేన్-24; షకీబ్ అల్ హసన్-24పరుగులతో రాణించారు. నిర్ణీత  20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. లంక బౌలర్లలో హసరంగ, కరునరత్నే చెరో రెండు; మధుశంక, తీక్షణ, ఫెర్నాండో తలా ఒక వికెట్ పడగొట్టారు.

ఆ తర్వాత లంక ఎనిమిది వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లలో లక్ష్యం ఛేదించింది.

కుశాల్ మెండీస్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

Also Read : Asia Cup-2022: సూపర్ 4కు ఇండియా

RELATED ARTICLES

Most Popular

న్యూస్