Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్ఆసీస్ తో సిరీస్: మూడో టి 20లో శ్రీలంక గెలుపు

ఆసీస్ తో సిరీస్: మూడో టి 20లో శ్రీలంక గెలుపు

Lanka Won: ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరుగుతోన్న టి20 సిరీస్ చివరి మ్యాచ్ లో శ్రీలంక 4 వికెట్లతో విజయం సాధించింది. మొదటి రెండు మ్యాచ్ లూ గెల్చుకొని ఇప్పటికే ఆసీస్ సిరీస్ గెల్చుకున్న సంగతి తెలిసిందే. పల్లెకేలేలో నేడు జరిగిన చివరి మ్యాచ్ లో ఆసీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

డేవిడ్ వార్నర్-39; స్టోనిస్ -38; స్టీవ్ స్మిత్-37; కెప్టెన్ పించ్-29 పరుగులు చేయడంతో ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 176 పరుగులు చేసింది, లంక బౌలర్లలో మహీష తీక్షణ రెండు; హసరంగ, జయ విక్రమ చెరో వికెట్ పడగొట్టారు.

ఆ తర్వాత బ్యాటింగ్ మొదలు పెట్టిన లంక జట్టులో కెప్టెన్ దాసున్ శనక 25బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 54 పరుగులతో నాటౌట్ గా నిలిచి విజయంలో కీలకపాత్ర పోషించాడు. పాతుమ్ నిశాంక-27; చరిత్ అసలంక-26 పరుగులతో రాణించారు. 19.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసిన లంక విజయం నమోదు చేసింది.

ఆసీస్ బౌలర్లలో స్టోనిస్, హాజెల్ వుడ్ చెరో రెండు; జయ్ రిచర్డ్సన్, అగర చెరో వికెట్ పడగొట్టారు.

లంక కెప్టెన్ దాసున్ శనక కు ‘మ్యాన్ అఫ్ ద మ్యాచ్’ లభించగా, మ్యాన్ అఫ్ ద సిరీస్ గా ఆసీస్ కెప్టెన్ ఆరోన్ పించ్ సాధించాడు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్