Saturday, May 10, 2025
HomeసినిమాSrikanth Addala: జూన్ 2న అడ్డాల కొత్త సినిమా టైటిల్, ఫస్ట్ లుక్

Srikanth Addala: జూన్ 2న అడ్డాల కొత్త సినిమా టైటిల్, ఫస్ట్ లుక్

‘కొత్త బంగారులోకం’ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన శ్రీకాంత్ అడ్డాల ఆతర్వాత ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ తో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించారు. ఆతర్వాత తెరకెక్కించిన ‘బ్రహ్మోత్సవం’ ప్లాప్ అయ్యింది. కొంత గ్యాప్ తర్వాత వెంకటేష్ తో ‘నారప్ప’  సినిమాని డైరెక్ట్ చేశారు. ఈ మూవీ డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజైంది. శ్రీకాంత్ అడ్డాల తన కొత్త సినిమాను ప్రకటించారు.

‘ద్వారకా క్రియేషన్స్‌ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాణంలో కొత్త సినిమా చేస్తున్నారు. జూన్ 2న సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ ని విడుదల చేయనున్నారు. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ లో రక్తం గుర్తులతో ఉన్న చేతిని మనం చూడవచ్చు. మరో 3 రోజుల్లో టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కానున్నాయి. ద్వారకా క్రియేషన్స్ ‘అఖండ’తో సంచలన బ్లాక్‌బస్టర్‌ ని అందించింది. దీంతో వీరి నుంచి రాబోతున్న ప్రాజెక్ట్స్ పై భారీ అంచనాలు ఉన్నాయి. అంచనాలకు తగ్గట్టుగానే శ్రీకాంత్ అడ్డాల న్యూ ఏజ్ సినిమాతో రాబోతున్నారు. మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్