అక్కినేని నాగచైతన్య నటించిన లేటెస్ట్ మూవీ థ్యాంక్యూ. ఇటీవల ఈ మూఈవ రిలీజైంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్ వ్యూలో చైతన్య మాట్లాడుతూ… మంచి స్టోరీ సెట్ అయితే.. అఖిల్ తో కలిసి మల్టీస్టారర్ చేస్తానన్నారు. చైతన్య అలా చెప్పడంతో.. ఈ క్రేజీ మల్టీస్టారర్ ను ఎవరు డైరెక్ట్ చేస్తారు..? ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు..? ఎప్పుడు సెట్స్ పైకి వస్తుంది..? అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ఇంతలో ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అది ఏంటంటే.. సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ఓ స్టోరీ రెడీ చేసి నాగార్జునకు వినిపించాడట. ఆ కథను అఖిల్ కోసం శ్రీకాంత్ అడ్డాల రెడీ చేశాడు. అయితే.. కథ విని నాగార్జున ఇందులో చైతన్యకు కూడా ఓ క్యారెక్టర్ డిజైన్ చేసి మల్టీస్టారర్ లా మార్పులు చేర్పులు చేయమని చెప్పాడట. దీంతో శ్రీకాంత్ అడ్డాల అదే పనిలో ఉన్నాడని.. త్వరలోనే ఫుల్ స్టోరీని నాగార్జునకు వినిపిస్తాడట.
ఇది ఫ్యామిలీ సబ్జెక్ట్. ఇందులో ఓ కొత్త పాయింట్ ఉందట. ఈ పాయింట్ నాగార్జునకు బాగా నచ్చిందట. అందుకనే ఈ మూవీని నాగార్జునే స్వయంగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మించనున్నారని సమాచారం. మరి.. అన్నీ అనుకున్నట్టుగా జరిగి ఈ ప్రాజెక్ట్ సెట్ అయితే… అక్కినేని అభిమానులకు పండగే.
Also Read : లైఫ్ లో ఒకసారి వెనక్కి వెళ్లమని చెప్పే ‘థ్యాంక్యూ’