Saturday, January 18, 2025
Homeసినిమాశ్రీకాంత్ అడ్డాల చేతుల మీదుగా ‘నిన్నే పెళ్లాడతా’ టీజర్

శ్రీకాంత్ అడ్డాల చేతుల మీదుగా ‘నిన్నే పెళ్లాడతా’ టీజర్

అమన్ (రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు), సిద్ధికా శర్మ హీరోహీరోయిన్లుగా అంబికా ఆర్ట్స్, ఈశ్వరీ ఆర్ట్స్ పతాకాల పై వైకుంఠ్ బోను దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నిన్నే పెళ్లాడ‌తా’. రమ్య రాజశేఖర్, శ్రీధర్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్ సెకండ్ వీక్‌లో విడుదల కానున్న ఈ చిత్ర టీజర్‌ను ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చేతుల మీదుగా చిత్రయూనిట్ విడుదల చేసింది.

శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ.. ‘‘ నిన్నేపెళ్లాడతా.. ఆల్రెడీ అందరికీ తెలిసిన టైటిల్ ఇది. ఈ టైటిల్‌తో కొత్త కథతో వస్తున్న టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్. టీజర్ చాలా బాగుంది. ఈ సినిమా మంచి విజయం సాధించి టీమ్ అందరికీ మంచి గుర్తింపును తీసుకురావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

చిత్ర దర్శకుడు వైకుంఠ్ బోను మాట్లాడుతూ.. ‘‘ చిత్రాన్ని అక్టోబర్ సెకండ్ వీక్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఇప్పుడు శ్రీకాంత్ అడ్డాల గారు టీజర్ విడుదల చేశారు. నెక్ట్స్ వీక్ మరో గెస్ట్‌తో రొమాంటిక్ సాంగ్‌ని విడుదల చేయనున్నాం. ఈ సినిమా అంద‌రికీ న‌చ్చుతుంది అనుకుంటున్నాను” అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్