Sunday, January 19, 2025
Homeసినిమా‘రుద్రవీణ’ నుంచి ‘బంగారు బొమ్మ’ పాట రిలీజ్

‘రుద్రవీణ’ నుంచి ‘బంగారు బొమ్మ’ పాట రిలీజ్

రాగుల గౌరమ్మ సమర్పణలో సాయి విల్ల సినిమాస్ పతాకంపై శ్రీరామ్ నిమ్మల, ఎల్సా గోష్, శుభశ్రీ సోనియా హీరో, హీరోయిన్లుగా మధుసూదన్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రుద్ర వీణ‘.  రాగుల లక్ష్మణ్, రాగుల శ్రీనులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని “బంగారు బొమ్మ ” పాటను హైదరాబాద్ లో చిత్ర యూనిట్ సమక్షంలో హీరో శ్రీకాంత్ విడుదల చేశారు.

శ్రీకాంత్ మాట్లాడుతూ  “ఈ టైటిల్ మన తెలుగు ప్రజలందరికీ తెలిసిన టైటిల్.  చిరంజీవి అన్నయ్యకు మంచి పేరు తీసుకువచ్చింది. అప్పటి సినిమాలోని పాటలు ఎంతో మ్యూజికల్ హిట్ గా నిలిచి పోయాయి. అలాంటి గొప్ప టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలోని ‘బంగారు బొమ్మ’ పాట విన్నాను, చాలా బాగా ఉంది. ఈ పాటతో పాటు సినిమాలోని అన్ని పాటలు కూడా బిగ్ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ సినిమాకు పని చేసిన టెక్నిషియన్స్, ఆర్టిస్టులందరికి ఆల్ ద బెస్ట్” అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్