Saturday, January 18, 2025
Homeసినిమాఅటు శ్రీను వైట్ల .. ఇటు గోపీచంద్!

అటు శ్రీను వైట్ల .. ఇటు గోపీచంద్!

శ్రీను వైట్ల .. ఒకప్పుడు టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరు. శ్రీను వైట్ల నుంచి ఒక సినిమా వస్తుందంటే, అది ఒక విందుభోజనంలా ఉంటుందనే నమ్మకం ఆడియన్స్ లో ఉండేది. కథ ఏదైనా .. అది వినోదాన్ని విడిచిపెట్టకుండా నడుస్తుంది. కామెడీ ఎపిసోడ్స్ ను తెరకెక్కించడంలో ఆయనకంటూ ఒక ప్రత్యేకత ఉంది. ఈవీవీ తరువాత నాన్ స్టాప్ కామెడీని అందించే దర్శకుడిగా ప్రశంసలు అందుకున్న దర్శకుడు ఆయన.

అలాంటి శ్రీను వైట్లకి ఆ మధ్య వరుస ఫ్లాపులు పడ్డాయి. హీరో ఎవరైనా .. బడ్జెట్ ఏ స్థాయిలో పెట్టినా సక్సెస్ అనేది ఆయనకి కనుచూపు మేరలో కనిపించకుండా పోయింది. దాంతో సహజంగానే ఆయనకి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. అయితే కొంతకాలంగా ఆయన మరింత తపనతో ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాడు. మొత్తానికి ‘విశ్వం’ అనే ఒక ప్రాజెక్టును సెట్ చేసుకుని దానిని సెట్స్ పైకి తీసుకుని వెళ్లాడు. ఈ సినిమాకి సంబంధించిన మేకింగ్ వీడియోను నిన్ననే వదిలారు.

గోపీచంద్ హీరోగా ఈ సినిమా రూపొందుతోంది. మేకింగ్ వీడియోను బట్టి చూస్తే, ఈ సినిమా అటు శ్రీను వైట్ల మార్క్ కి .. ఇటు గోపీచంద్ బాడీ లాంగ్వేజ్ కి తగినట్టుగా కనిపిస్తోంది. దాదాపు విదేశాలలో ఎక్కువ చిత్రీకరణ జరుపనున్నారనే విషయం అర్థమవుతోంది. ఈ సినిమా హిట్ కొట్టడం శ్రీను వైట్లకి చాలా అవసరం. ఇక వరుస ఫ్లాపులతో ఉన్న గోపీచంద్ కి కూడా సక్సెస్ అత్యవసరమే. ఈ ఇద్దరి ముచ్చటను ఈ సినిమా తీరుస్తుందేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్