Saturday, January 18, 2025
Homeసినిమానా ఆనందానికి అవధుల్లేవ్ : రాజమౌళి

నా ఆనందానికి అవధుల్లేవ్ : రాజమౌళి

బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ చిత్రాల సృష్టికర్త ఎస్.ఎస్. రాజమౌళి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి, ఇటీవలే ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని  నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు లభించిన సంగతి తెలిసిందే. ఈ అవార్డు దక్కిన ఆనందంలో ఉండగానే బాలీవుడ్  సుప్రసిద్ధ  దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్  ను రాజమౌళి, కీరవాణిలు కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనతో దిగిన ఫోటోను షేర్ చేస్తూ ‘ నేను దేవుణ్ణి కలుసుకున్నాను’ అంటూ తన సంతోషం వ్యక్తం చేశారు.

రాజమౌళి తాజాగా మరో సుప్రసిద్ధ దర్శకుడు జేమ్స్ కామెరూన్ ను కూడా కలిశారు. దీనిపై ట్వీట్ చేస్తూ ” ది గ్రేట్ కామెరూన్ ఆర్ ఆర్ ఆర్ సినిమా చూశారు. ఆయనకు సినిమా ఎంతో నచ్చింది. ఈ సినిమా చూడమని తన భార్య సుజీకి కూడా అయన సూచించారు, ఆమెతో కలిసి రెండోసారి కూడా సినిమా చూశారు” అంటూ తెలియజేశారు.

ఆయన్ను కలవడం ఎంతో సంతోషంగా ఉందని, పైగా 10 నిమిషాలపాటు కేవలం తన సినిమా గురించి  విశ్లేషించారని తెలిపారు. ఇప్పుడు తన ఆనందానికి అవధుల్లేవని, ప్రపంచలోనే ఎంతో ఎత్తులో విహరిస్తున్నట్లు ఉందని వ్యాఖ్యానించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్