Saturday, March 2, 2024
HomeTrending Newsనాగబాబు కామెంట్ – అంబటి కౌంటర్

నాగబాబు కామెంట్ – అంబటి కౌంటర్

మొన్న భోగి సందర్భంగా రాష్ట్ర జలవనరుల శాఖ  మంత్రి అంబటి రాంబాబు చేసిన డ్యాన్స్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సోషల్ మీడియాలో రాంబాబు డ్యాన్స్ చేసిన వీడియో విపరీతంగా వైరల్ అయ్యింది. ఈ డ్యాన్స్ పై జన సేన పార్టీ నేత, నటుడు నాగబాబు స్పందించారు. ఈ వీడియోను జత చేస్తూ  “సంబరాల రాంబాబు గారు మీరు డ్యాన్స్ మహత్తరంగా చేసారు… పోలవరం పూర్తి చేసి డ్యాన్స్ చేసి వుంటే ఇంకా మహత్తరంగా వుండేది !” అంటూ ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్ పై అంబటి కూడా తనదైన శైలిలో ప్రతిస్పందించారు. “నువ్వు,  మీ తమ్ముడు అన్నట్టు “సంబరాల రాంబాబు”నే ! కానీ…ముఖానికి రంగు వేయను ప్యాకేజి కోసం డాన్స్ చేయను!”  అంటూ బదులిచ్చారు.  కాసేపటి తర్వాత”పోలవరం మేమే పూర్తి చేస్తాం ! చంద్రబాబు,పవన్ బాబు,నాగబాబుతో డాన్స్ చేయిస్తాం!” అంటూ మరో ట్వీట్ తో నాగబాబుకు బదిలిచ్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్