Sunday, January 19, 2025
HomeసినిమాSS Thaman: 'భగవంత్ కేసరి' రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన థమన్

SS Thaman: ‘భగవంత్ కేసరి’ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన థమన్

బాలకృష్ట నటిస్తున్న తాజా చిత్రం భగవంత్ కేసరి. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి డైరెక్టర్. అఖండ, వీరసింహారెడ్డి చిత్రాలతో వరుసగా సక్సెస్ సాధించడంతో భగవంత్ కేసరి సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. పైగా ఈ చిత్రానికి అపజయం అనేది లేకుండా వరుసగా సక్సెస్ సాధిస్తున్న అనిల్ రావిపూడి డైరెక్టర్ కావడంతో ఖచ్చితంగా భగవంత్ కేసరి విజయం సాధించడం ఖాయమని అభిమానులే కాకుండా సినీ జనాలు కూడా గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇందులో బాలయ్య తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడడం విశేషం.

ఈ చిత్రాన్ని అక్టోబర్ 19న విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. అయితే.. బాలకృష్ణ పొలిటికల్ గా బిజీ అవ్వడం.. ఈ సినిమా షూటింగ్ బ్యాలెన్స్ ఉండడంతో భగవంత్ కేసరి అనౌన్స్ చేసిన డేట్ కి వస్తుందా..? వాయిదా పడుతుందా..? అనే అనుమానం స్టార్ట్ అయ్యింది. ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. అయితే.. భగవంత్ కేసరి బీజీఎమ్ వర్క్ స్టార్ట్ అయ్యింది. అక్టోబర్ 19న రిలీజ్ కానున్న ఈ మూవీతో థియేటర్స్ మోత మ్రోగిపోవడం ఖాయం. జై బాలయ్య.. హ్యాట్రిక్ అంటూ సంగీత దర్శకుడు థమన్ ఇన్ స్టాగ్రామ్ లో స్టోరీలో పోస్ట్ పెట్టారు.

ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో భగవంత్ కేసరి రిలీజ్ డేట్ పై మరోసారి క్లారిటీ వచ్చింది. ఇందులో బాలయ్యకు జంటగా కాజల్ నటిస్తే.. కూతురుగా శ్రీలీల నటించింది. ఈ మూవీ గ్లింప్స్ అండ్ సాంగ్ కు అనూహ్య స్పందన వచ్చింది. ఇప్పుడు సెకండ్ సాంగ్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నెలాఖరు లేదా అక్టోబర్ ఫస్ట్ వీక్ నుంచి ప్రమోషన్స్ లో మరింతగా స్పీడు పెంచనున్నారు మేకర్స్.

RELATED ARTICLES

Most Popular

న్యూస్