కేంద్రం నుంచి రాష్టానికి పన్నుల వాటా రూపంలో వస్తోన్న నిధుల విషయంలో అన్యాయం జరుగుతోందని, 41శాతం ఇస్తున్నామని చెబుతున్నా వాస్తవానికి 32.56 శాతం మాత్రమే డివల్యూషన్ అఫ్ ఫండ్స్ రూపంలో ఇస్తున్నారని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి విజయసాయి రెడ్డి ఆరోపించారు. కేంద్రం పన్నులు పెంచడంలేదని, కానీ సర్ ఛార్జ్, సెస్ పెంచుతూ పోతోందని… పన్నుల్లో అయితే రాష్ట్రాలకు వాటా ఇవాల్సి వస్తుందని కానీ సర్ ఛార్జ్, సెస్ ల ద్వారా వచ్చే ఆదాయంలో రాష్ట్రాలకు ఇవ్వాల్సిన అవసరం లేదని, అందుకే కేంద్రం అలా చేస్తోందని విశ్లేషించారు. వీటి మీద వచ్చే ఆదాయంలో కూడా పంచి ఉంటే ఎపీకి అదనంగా 45 నుంచి 50 వేల కోట్ల రూపాయలు వచ్చి ఉండేవన్నారు.ఢిల్లీలో పార్టీ ఎంపీలతో కలిసి మీడియాతో మాట్లాడారు.
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగానే ఉందని, కేంద్ర ప్రభుత్వం, మిగిలిన రాష్ట్రాల కంటే కూడా ఆంధ్ర ప్రదేశ్ పరిస్థితే మెరుగ్గా ఉందని… కానీ చంద్రబాబు కావాలనే తమ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వ డేట్ జిడిపి శాతం 57 శాతంగా ఉందని, పంజాబ్ తర్వాతి స్థానంలో ఉందని, ఏపీ ఐదో స్థానంలో నిలిచిందన్నారు. ఎగుమతుల్లో కూడా రాష్ట్రం పురోగతిలో ఉందని, కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే ఆదాయం తగ్గిందని, కేంద్రానికి పన్నుల వాటా వస్తున్నా రాష్ట్రాల వాటా సక్రమంగా ఇవ్వడంలేదని విజయసాయి అన్నారు.
జూలై19న జరిగిన అఖిలపక్ష సమావేశంలో శ్రీలంక పరిస్థితిని వివరించడానికి, భారత్ తరఫున చేయబోతోన్న సాయం గురించి చెప్పారని, ఆశ్చర్యకరంగా కేంద్ర ఆర్ధిక శాఖ అధికారులు రాష్ట్రాల పరిస్థితిపై కూడా చెప్పారని విజయసాయి చెప్పారు. శ్రీలంకలో ఎగుమతులు తగ్గి దిగుమతులు పెరగడం, పర్యాటక రంగం దెబ్బతిని పోవడం, సేంద్రీయ వ్యవసాయం వల్ల ఉత్పత్తులు తగ్గిపోయాయని అందుకే సంక్షోభం తలెత్తిందని చెప్పారు. అక్కడిపరిస్థితులు చంద్రబాబుకు తెలియవన్నారు.