Saturday, January 18, 2025
HomeTrending Newsకేసిఆర్ పాలనలోనే తీవ్ర అన్యాయం: మంత్రి ఉత్తమ్

కేసిఆర్ పాలనలోనే తీవ్ర అన్యాయం: మంత్రి ఉత్తమ్

అరవై ఏళ్ళ సమైక్య పాలనలో కన్నా పదేళ్ళ పదేళ్ల బిఆర్ఎస్ పాలనలోనే నీటి విషయంలో తెలంగాణకు  ఎక్కువ అన్యాయం జరిగిందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.  రాష్ట్ర ఏర్పాటు తర్వాత మనకు న్యాయం జరుగుతుంది అనుకున్నా టిఆర్ఎస్ వైఖరి వల్ల కృష్ణానదిలో మన వాటాను ఏపీ అక్రమంగా వాడుకుంటున్నా ఏమీ చేయలేకపోయారని విమర్శించారు.  సాగు నీటి ప్రాజెక్టుల్ని కృష్ణారివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డుకు అప్పగించకూడదని తెలంగాణ అసెంబ్లీలో  మంత్రి ఉత్తమ్‌ ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడిన ముఖ్యాంశాలు:

  • కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ కీ దారాదత్తం చేశారు.
  • ఏపీ సిఎం జగన్ , మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 2019 మే 28న ఏకాంతంగా చర్చలు చేసుకున్నారు
  • బిర్యానీ తిన్నారు అలయ్ బలయ్ చేసుకున్నారు.
  • శ్రీ శైలం నుండీ రోజుకు 3 టీఎంసీ ల వాటర్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం తరలించుకోని పోతుంటే కేసీఆర్. ఎన్నడూ మాట్లడలేదు
  • బిఆర్ఎస్ చేసిన ఘనకార్యం వల్ల నాగార్జున సాగర్ డ్యామ్ ఎండి పొయ్యే పరిస్థితీకీ వచ్చింది.
  • KRMB నీ రెండు రాష్ట్రాల నీటి వాటా తేల్చేందుకు ఏర్పాటు చేశారు.
  • నీటి పంపకాల విషయంలో గత ప్రభుత్వం ఎటువంటి అబ్జెక్షన్ చెప్పలేదు.
  • ఎన్నికలకు ఒక్క రోజు ముందు నాగార్జున సాగర్ ను ఏపి పోలీసులు ఆక్రమించారు.
  • తెలంగాణ ప్రజలను కొన్ని అపోహలకు గురిచేస్తున్నారు. దాని మీద వివరణ ఇవ్వాల్సి ఉంది.
  • భారతదేశంలో గంగ, గోదావరి తర్వాత కృష్ణ పెద్ద నది.
  • మహారాష్ట్ర మహాబలేశ్వర్ లో ప్రారంభమై బంగాళాఖాతం లో కలుస్తుంది. గత పాలకుల వల్ల తెలంగాణ నిర్లక్ష్యానికి గురైంది.
  • శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఎంత ఇల్లీగల్ గా నీటి తరలింపు జరిగిందో తెలిస్తే ఆశ్చర్య పోతారు.
  • 12వందల టీఎంసీ లు ఉంటే 812 టీఎంసీ లు అక్రమంగా తెలంగాణ ప్రభుత్వ ఏర్పాటు తర్వాత తరలించనున్నారు.
  • గతం కన్నా 50శాతం ఎక్కువ నీటిని తరలించనున్నారు.
  • నీటి వాటా విషయంలో కేసిఆర్ ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది
  • నీటి వాటా ల పంపకాల విషయంలో నీరు ఎంత భూ భాగంలో ప్రవహిస్తుంది. ఇక్కడ ఉన్న జనాభా ఆధారంగా కేటాయింపు జరగాలి.
  • హరీష్ రావు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీకి వెళ్లి 299 టీఎంసీ లకు ఒప్పుకొని కృష్ణ నది లో నీటి వాటా లో తెలంగాణ కి శాశ్వత నష్టం చేశారు
  • అప్పటికే అన్ని ప్రాజెక్టులు కృష్ణ నది మీద నిర్మాణాలు ప్రారంభమైనాయి
  • కేసిఆర్ ఎన్నోసార్లు పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడారు.
  • 27,500 కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలేదు
  • నిర్మాణం లో ఉన్న ప్రాజెక్టులు కలుపుకొని 599 టీఎంసీ అవసరం ఉంటే బోర్డును ఎందుకు అడగలేదు.
RELATED ARTICLES

Most Popular

న్యూస్