ఇండోనేషియా మొదటి అధ్యక్షుడు సుకర్నో కుమార్తె సుక్మవతి సుకర్నోపుత్రి మంగళవారం ఇస్లాం నుంచి హిందు మతం స్వీకరించారు. సుక్మావతి 70 వ పుట్టిన రోజు సందర్భంగా బాలీలోని సుకర్నో కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో హైందవ మతాచారాల ప్రకారం మతం మారారు. బాలి ద్వీపంలో హిందూ మత ఆచారాలు ఇప్పటికి ఆచరించటం తనను ప్రాభావితం చేసిందని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.
ఇండోనేసియాలో గొప్ప నాయకుడిగా పేరొందిన సుకర్నో మూడో కుమార్తె సుక్మావతి సుకర్నోపుత్రి. ఇండోనేషియా గతంలో అధ్యక్షురాలిగా వ్యవహరించిన మేఘావతి సుకర్నోపుత్రి చెల్లలే సుక్మావతి కావటం గమనార్హం.
2018లో జరిగిన ఓ ఘటనతో సుక్మావతి మతమార్పిడికి దోహదం చేసిందని ఇండోనేషియా మీడియాలో కథనాలు వస్తున్నాయి. సుక్మావతి రాసిన ఓ కవితలో ఇస్లాం ను కించపరిచే విధంగా ఉన్నాయని అక్కడి అతివాద గ్రూపులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాయి. దేశవ్యాప్తంగా అప్పుడు ఆందోళనలకు దారితీసి వివాదాస్పద అంశంగా మారింది. సుక్మావతి అప్పుడు క్షమాపణ చెప్పటంతో వివాదం సద్దుమణిగింది.
ప్రపంచంలో ఇస్లాం అనుసరిస్తున్న దేశాల్లో అత్యధిక జనాభా కలిగిన దేశం ఇండోనేషియా. ఆ తర్వాతి స్థానంలో ముస్లీం జనాభా అధికంగా ఉన్న దేశం ఇండియా.