Saturday, January 18, 2025
Homeసినిమామెగాస్టార్ ని డైరెక్ట్ చేయ‌నున్న సుకుమార్

మెగాస్టార్ ని డైరెక్ట్ చేయ‌నున్న సుకుమార్

Mega Sukumar: మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాల‌ని ప్రతి ద‌ర్శకులు కోరుకుంటారు. ఆ అద్భుత‌మైన అవ‌కాశం ఎప్పుడు వ‌స్తుందా అని క‌లలు కంటారు. అలా.. క‌లలు గన్న ద‌ర్శకుల్లో క్రియేటివ్ జీనియ‌స్ సుకుమార్ ఒక‌రు. అయితే.. ఆయ‌న క‌ల త్వర‌లోనే నిజం కాబోతుంది. అవును.. మెగాస్టార్ చిరంజీవిని సుకుమార్ డైరెక్ట్ చేయ‌బోతున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి  చిరంజీవిని సుకుమార్ క‌లిశారు. త్వర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక స‌మాచారం వెలువ‌డ‌నుంది.

రీసెంట్‌గానే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో పుష్ప వంటి పాన్ ఇండియా సినిమాను తెర‌కెక్కించి బ్లాక్ బ‌స్టర్ హిట్ సాధించారు సుకుమార్. అంత‌కు ముందు మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌తో రంగ‌స్థలం వంటి సెన్సేష‌నల్ బ్లాక్ బ‌స్టర్‌ను తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు మెగాస్టార్‌ను చిరంజీవి సుకుమార్ డైరెక్ట్ చేయ‌బోతున్నారు. అయితే.. చిరంజీవి న‌టిస్తున్న ఓ యాడ్ ని సుకుమార్ డైరెక్ట్ చేయ‌నున్నార‌ని టాక్ వినిపిస్తోంది. అలాగే వీరిద్దరి కాంబినేష‌న్లో ఓ భారీ చిత్రం వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని కూడా ప్రచారం జ‌రుగుతుంది. అయితే.. చిరు, సుకుమార్ కాంబినేష‌న్లో యాడ్ రానుందా..?  మూవీ రానుందా..? అనేది తెలియాల్సివుంది.

Also Read : సుకుమార్ తో కోలీవుడ్ స్టార్ హీరో మూవీ?

RELATED ARTICLES

Most Popular

న్యూస్