Saturday, January 18, 2025
Homeసినిమానేను సినిమాల్లోకి రావడానికి రాజశేఖర్ గారే కారణం : సుకుమార్

నేను సినిమాల్లోకి రావడానికి రాజశేఖర్ గారే కారణం : సుకుమార్

He is inspiration: రాజ‌శేఖ‌ర్ హీరోగా ప్రకాష్ రాజ్, ఆత్మీయ రాజన్, జార్జ్ రెడ్డి ఫేమ్ ముస్కాన్, అభినవ్ గోమఠం, కన్నడ కిషోర్, సమీర్, భరణి శంకర్, రవి వర్మ, శ్రవణ్ రాఘవేంద్ర నటీనటులుగా జీవితా రాజశేఖర్ దర్శక‌త్వంలో రూపొందిన చిత్రం “శేఖర్”. ఈ చిత్రాన్ని బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం సంయుక్తంగా నిర్మించారు. నిర్వాణ సినిమాస్ సృజన ఎరబోలు ఓవర్సీస్ లో విడుదల చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ప్రపంచ వ్యాప్తంగా మే 20న గ్రాండ్ గా విడుదల కానుంది.

ఈ సందర్భంగా “శేఖర్” ప్రి రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం హైదరాబాద్ హోటల్ దస్పల్లా లో చిత్ర యూనిట్ ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రంలో సక్సెస్ ఫుల్ దర్శకుడు సుకుమార్, జాంబి రెడ్డి దర్శకుడు ప్రశాంత్ వర్మ, పాటల రచయిత రామజోగయ్య శాస్ట్రీ, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్, నటుడు సముద్ర ఖని, దర్శకుడు విజయ్ భాస్కర్, హీరో రాజ్ తరుణ్, కమెడియన్ శివారెడ్డి, నిర్మాత రాజ్ కందుకూరి, హీరో శివ కందుకూరి, కలర్ ఫోటో దర్శకుడు సందీప్ రాజ్, నిర్మాత రామసత్య నారాయణ , దొరసాని దర్శకుడు మహేంద్ర,, దర్శకుడు జ్ఞాన సాగర్, చిత్ర యూనిట్ పాల్గొన్నారు.

దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ “నా జీవితంలో రాజశేఖర్ గారితో నిజమైన ఎక్స్పీరియన్స్ ముడిపడింది సినిమాకు సంబంధించి. ఆయన పీక్ లో ఉన్నప్పుఫుడు ఆహుతి, ఆగ్రహం, తలంబ్రాలు, మగాడు, అంకుశం, వంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలు చూసి నేను తనకు ఎంతో వీరాభిమానినయ్యాను. అప్పుడే మొట్ట మొదటి సారి సినిమాకు సంబంధించిన ఆర్ట్ ఫామ్ అంటే.. నేను కూడా సినిమాలు చేయగలను అనే కాన్ఫిడెంట్ ఇచ్చింది. దాంతో నేను మొదటిసారి రాజశేఖర్ గారిని ఇమిటేట్ చేసి మాట్లాడేవాన్ని దాంతో మా ఊర్లో నేను చాలా ఫేమస్ అయ్యాను”

“ఆ తర్వాత నన్ను స్కూల్ లో తనలా మాట్లాడమనే వారు. అలా.. నేను కూడా సినిమాల్లోకి రాగలను ఏమైనా చేయగలను అనే న‌మ్మ‌కం ఏర్ప‌డ‌డానికి రాజ‌శేఖ‌ర్ గారే కారణం. అయితే.. ఇలా చెప్పే సందర్భం ఎప్పుడూ రాలేదు కాబట్టి ఇప్పుడు చెబుతున్నాను. ఇలా నాకు సినిమాకు సంబంధించిన లైఫ్ ను ఇంత అద్భుతంగా మార్చినందుకు చాలా థాంక్స్. మనం మన ఫ్యామిలీని ఇండస్ట్రీకి దూరం పెడతాం కానీ రాజశేఖర్ గారు తన ఇద్దరి ఆడపిల్లలను కూడా ఇండస్ట్రీకి తీసుకు రావడం చాలా గ్రేట్”

“జీవిత గారు చాలా హార్డ్ వర్కర్. తను ఫ్యామిలీని చూసుకుంటూ సినిమాతో పాటు దర్శకత్వం చేయడం చాలా కష్టం. కాబట్టి ఈ సినిమా జీవిత గారి కోసం సక్సెస్ కావాలి. రామ జోగయ్య శాస్తి గారు అద్భుతమైన పాటలు రాస్తాడు. అనూప్ గారు ఎన్ని బ్లాక్ బస్టర్స్ ఇచ్చినా ఇలాగే వినయంగా ఉంటాడు. ఈ నెల 20 న వస్తున్న శేఖర్ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుతున్నాను” అన్నారు.

Also Read : రాజశేఖర్ భుజాలపైనే పూర్తి బాధ్యత పెట్టేసిన ‘శేఖర్’ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్