Sunday, January 19, 2025
Homeసినిమా'పుష్ప 2' టీజర్ కే అంత బడ్జెట్!

‘పుష్ప 2’ టీజర్ కే అంత బడ్జెట్!

పుష్ప.. టాలీవుడ్ నే కాదు.. బాలీవుడ్ ని కూడా షేక్ చేసిన చిత్రమిది. ఇప్పుడు రష్యాలో రిలీజై అక్కడ కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. దీంతో పుష్ప 2 పై మరింత క్రేజ్ ఏర్పడింది. ఆమధ్య పూజా కార్యక్రమాలతో పుష్ప 2 షూటింగ్ స్టార్ట్ చేశారు. ఆతర్వాత పుష్ప 2 టీజర్ కోసం షూటింగ్ చేశారు. రష్యాలో ప్రమోషన్స్ కోసం పుష్ప టీమ్ వెళ్లడంతో పుష్ప 2 షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు. ఇప్పుడు పుష్ప టీమ్ ఇండియాకి తిరిగా రావడంతో షూటింగ్ స్టార్ట్ చేశారు. ప్రస్తుతం అల్లు స్టూడియోస్ లో పుష్ప 2 షూటింగ్ జరుగుతుంది. బన్నీ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

అయితే… పుష్ప 2 మూవీ షూటింగ్ కంప్లీట్ కాకుండానే పుష్ప 2 టీజర్ రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అది కూడా పుష్ప 2 టీజర్ ను అవతార్ 2 రిలీజ్ అవుతున్న థియేటర్లో రిలీజ్ చేస్తే… ఈ సినిమా పై మరింత క్రేజ్ వస్తుంది అనేది సుకుమార్ ఆలోచన. అందుకనే పుష్ప 2 టీజర్ రెడీ చేశారని వార్తలు వస్తున్నాయి. అందుకోసం మైత్రి మూవీ మేకర్స్ ఊహించిన విధంగా 3 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం. కేవలం టీజర్ కోసమే ఈ రేంజ్ లో బడ్జెట్ పెట్టారంటే.. ఇక సినిమా షూటింగ్ కోసం ఎంత బడ్జెట్ కేటాయిస్తారో అనేది ఆసక్తిగా మారింది.

పుష్ప మూవీకి వచ్చిన ఆదరణ చూసి.. పుష్ప 2  తప్పకుండా సక్సెస్ అవుతుంది అని ఆలోచనతో ఈసారి బడ్జెట్ ఎంతైనా ఓకే అంటున్నారు మేకర్స్. ఇక ఈ టీజర్ అయితే… అవతార్ 2 సినిమా రిలీజ్ సమయంలో ఇండియన్ థియేటర్స్ లో విడుదల చేస్తారని ఇది వరకే ఒక టాక్ వచ్చింది. అయితే.. షూట్ ఆలస్యమైంది అని అలా విడుదల అయ్యే అవకాశం లేకపోవచ్చు అని కూడా మరొక టాక్ వినిపిస్తుంది. అయితే.. ఎట్టి పరిస్థితుల్లోనూ అవతార్ 2 థియేటర్లో ఇండియా వైడ్ ఈ టీజర్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. మరి.. అదే కనుక జరిగితే… ఈ టీజర్ ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Also Read : పుష్పలో చరణ్ క్యారెక్టర్ ఇదేనా? 

RELATED ARTICLES

Most Popular

న్యూస్