Sunday, January 19, 2025
Homeసినిమాసేవాదాస్"లో నటించడం గర్వంగా ఉంది: సుమన్, భానుచందర్

సేవాదాస్”లో నటించడం గర్వంగా ఉంది: సుమన్, భానుచందర్

Its Honour: శ్రీశ్రీ హథీరామ్ బాలాజీ క్రియేషన్స్ పతాకం పై యువ ప్రతిభాశాలి కె.పి.ఎన్.చౌహాన్ దర్శకత్వంలో ఇస్లావత్ వినోద్ రైనా-సీతారామ్ నాయక్ సంయుక్తంగా నిర్మించిన ప్రతిష్టాత్మక బహుభాషా చిత్రం ‘సేవాదాస్’. సీనియర్ హీరోలు సుమన్, భానుచందర్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రంలో కె.పి.ఎన్. చౌహాన్, ప్రీతి అస్రాని, వినోద్ రైనా-రేఖా నిరోష హీరో హీరోయిన్లు. కె.పి.ఎన్.చౌహాన్ దర్శకత్వంలో బంజారా-తెలుగు- ఇంగ్లీష్-హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సేవాలాల్ గా నటించిన సీనియర్ హీరో సుమన్, కీలక పాత్ర పోషించిన భానుచందర్, హీరో-డైరెక్టర్ కె.పి.ఎన్. చౌహాన్, నిర్మాతలు ఇస్లావత్ వినోద్ రైనా- సీతారామ్ నాయక్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బాలు ఎమ్.చౌహాన్, సెకండ్ హీరో-హీరోయిన్స్ వినోద్ రైనా, రేఖా నిరోష పాలుపంచుకుని చిత్ర విశేషాలు వెల్లడించారు.

బంజారా సంస్కృతిని, ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పే ‘సేవాదాస్’ లో నటించడం గర్వంగా ఉందన్నారు సుమన్, భానుచందర్. 64 దేశాల్లో గల 18 కోట్ల బంజారాలతోపాటు తెలుగు, హిందీ ప్రేక్షకుల హృదయాలకు హత్తుకునేలా ‘సేవాదాస్’ చిత్రాన్ని తీర్చిదిద్దిన దర్శకనిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులను వారు అభినందించారు. ఏప్రిల్ 1 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా సంచలన విజయం సాధించడం ఖాయమని హీరో కమ్ డైరెక్టర్ కె.పి.ఎన్. చౌహాన్ విశ్వాసం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్