Friday, April 4, 2025
HomeTrending Newsమార్గదర్శి కేసులో రామోజీకి నోటీసులు

మార్గదర్శి కేసులో రామోజీకి నోటీసులు

మార్గదర్శి చిట్ ఫండ్ సులో ఈనాడు గ్రూపు సంస్థల ఛైర్మన్ చెరుకూరి రామోజీరావుకు, ఏపీ​ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన కేసుపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరిగింది. ఏపీ ప్రభుత్వం తరపున వికాస్‌ సింగ్‌ వాదనలు వినిపించారు. పిటిషన్‌లో లేవనెత్తిన అంశాలకు నాలుగు వారాల్లో సమాధానం చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించినట్లు పిటిషనర్‌ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ తెలిపారు. ‘మార్గదర్శి కేసులో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దాఖలు చేసిన పిటిషన్‌పై రామోజీరావుకు ధర్మాసనం నోటీసులు ఇచ్చింది. 4 వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. మార్గదర్శిలో చేసింది నేరమా కాదా అనే విషయంపై వాదనలు కొనసాగనున్నాయి. ఏపీ ప్రభుత్వం మార్గదర్శి కేసులో ప్రధాన పాత్ర పోషించబోతుంది” అని ఉండవల్లి వెల్లడించారు.

తెలంగాణ ముఖ్యమంత్రిని కూడా మార్గదర్శి కేసులో పిటిషన్ దాఖలు చేయాలని కోరామని, రెండు నెలలవుతున్నా ఇంకా అయన ఇంప్లీడ్ కాలేదని చెప్పారు. ఎందుకు ఆలస్యం అయిందో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు.

ఈ కేసులో రామోజీరావు కూడా సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారని, ఖాతాదారుల నుంచి డిపాజిట్లు ఎంతోమంది తీసుకుంటున్నారు వారిని ఒక విధంగా, రామోజీరావును ఒక విధంగా చూడొద్దని కోర్టును కోరామని ఉండవల్లి తెలిపారు. డిపాజిట్లు తీసుకోవడం నేరమా కాదా అనేది మాత్రమే కోర్టును అడుగుతున్నామని, డిపాజిట్ దారుల వివరాలు కూడా తన వద్ద ఉన్నాయని ఉండవల్లి వివరించారు

Also Read: బాబు ఫ్రస్ట్రేషన్‌తో మాట్లాడుతున్నారు: అంబటి

RELATED ARTICLES

Most Popular

న్యూస్