Sunday, January 19, 2025
Homeసినిమాఫిబ్రవరి 3న వస్తున్న ‘సువర్ణ సుందరి’

ఫిబ్రవరి 3న వస్తున్న ‘సువర్ణ సుందరి’

డాక్టర్ ఎమ్‌వికె రెడ్డి సమర్పణలో ఎస్ టీమ్ పిక్చర్స్ పతాకంపై సీనియర్ నటి జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘సువర్ణసుందరి’. సురేంద్ర మాదారపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ చిత్రాన్ని ఎమ్.ఎల్. లక్ష్మీ నిర్మించారు. కరోనా ప్రభావంతో వాయిదా పడిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 3వ తేదీన భారీ స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సురేంద్ర మాదారపు మాట్లాడుతూ.. ‘‘గోల్డెన్ గ్లోబ్ అవార్డుతో తెలుగు సినిమా ఇండస్ట్రీని.. ప్రపంచం మెచ్చుకునే స్థాయిలో నిలబెట్టిన ‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌కి, రాజమౌళి గారికి ధన్యవాదాలు. ‘సువర్ణసుందరి’ సినిమా విషయానికి వస్తే.. ఇది సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ మూవీ. ఇప్పటి వరకు సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్, సాంగ్స్, ట్రైలర్‌‌కు చాలా మంచి ఆదరణ లభించింది. ఈ సినిమాని ఇప్పటికే విడుదల చేయాల్సింది. కరోనా ప్రభావంతో రిలీజ్ పోస్ట్‌పోన్ చేసి.. మంచి సమయం కోసం వేచి చూస్తూ వచ్చాం.

అయితే రీసెంట్‌గా పీఆర్వో వీరబాబు గారు ఈ సినిమా చూసి.. ఇంత మంచి సినిమాని ఎందుకు ఇంకా విడుదల చేయకుండా ఆపారు. వెంటనే విడుదల చేయండి.. తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాలను ఎప్పుడూ ఆదరిస్తారని చెప్పడమే కాకుండా.. ఈ సినిమాని ప్రేక్షకులలోకి తీసుకెళ్లే బాధ్యతని కూడా ఆయనే తీసుకున్నారు. ఇది సూపర్ న్యాచురల్ థ్రిల్లర్.. టెక్నికల్‌గా అద్భుతంగా ఉంటుంది. ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకులను అలరింపజేస్తుంది. సినిమాని ఫిబ్రవరి 3వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నాము. ప్రేక్షకులు ఆదరించి ఆశీర్వదిస్తారని కోరుతున్నాం అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్