Saturday, January 18, 2025
Homeసినిమాసంతోష్ శోభన్ - నందినీ రెడ్డిలకు ‘అన్నీ మంచి శకునములే’

సంతోష్ శోభన్ – నందినీ రెడ్డిలకు ‘అన్నీ మంచి శకునములే’

‘ఓ బేబి’ తర్వాత నందినీ రెడ్డి ఓ ప్రేమకథా చిత్రాన్ని చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. అంతే కాకుండా.. అక్కినేని నాగచైతన్యతో నందినీ రెడ్డి సినిమా చేయనుందని.. ఈ చిత్రాన్ని స్వప్నాదత్ నిర్మించనుందని టాలీవుడ్ లో టాక్ వినిపించింది. అంతే కాకుండా.. మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. ఆ తర్వాత ఎలాంటి అప్ డేట్ రాలేదు. ఇప్పుడు నందినీ రెడ్డి తదుపరి చిత్రంపై క్లారిటీ వచ్చింది. ‘ఏక్ మినీ కథ’తో సక్సస్ సాధించి మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో సంతోష్ శోభన్ తో నందినీ రెడ్డి సినిమా చేస్తుంది. ఈ సినిమాని అఫిషియల్ గా అనౌన్స్ చేశారు.

ఈ మూవీ టైటిల్ ‘అన్నీ మంచి శకునములే’. ఈ మూవీ మోషన్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. ఇందులో సంతోష్‌ శోభన్ సరసన మాళవిక నాయర్‌ కథానాయిక. మోషన్‌ పోస్టర్‌లో.. ఆహ్లాదరకరమైన తేయాకు తోటల మధ్య రైలు ప్రయాణించే సుందర దృశ్యాలు కనిపిస్తున్నాయి. వెన్నెల కిశోర్‌, రావు రమేశ్‌, నరేశ్‌, రాజేంద్ర ప్రసాద్‌, గౌతమి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. స్వప్న సినిమాస్‌, మిత్రవింద మూవీస్‌ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మిక్కీ జె. మేయర్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ టైటిల్ అండ్ మోషన్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. టైటిల్ కి తగ్గట్టుగా.. మంచి విజయం సాధిస్తుందని ఆశిద్దాం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్