ఈ మధ్య కాలంలో వెబ్ సిరీస్ లు కూడా భారీ సినిమాలను తలపిస్తున్నాయి. ఇక చారిత్రక నేపథ్యంలో రూపొందే సినిమాల విషయంలో కూడా ఎంతమాత్రం రాజీపడటం లేదు. అలా చారిత్రక నేపథ్యంలో ‘ZEE 5’లో వచ్చిన మరో వెబ్ సిరీస్ నే ‘తాజ్ డివైడెడ్ బై బ్లడ్’. మొన్నటి నుంచి ఈ వెబ్ సిరీస్ అందుబాటులోకి వచ్చింది. ఇది చాలామందికి తెలిసిన అక్బర్ చరిత్ర. ఆయన జీవితంలోని ముఖ్యమైన ఘట్టాల ఆధారంగా ఈ వెబ్ సిరీస్ ను నిర్మించారు.
అక్బర్ కి ముగ్గురు భార్యలు .. ముగ్గురు కొడుకులు .. ఆయన ఇష్టపడి రహస్యంగా ఒక మందిరంలో ఉంచబడిన ‘అనార్కలి’ చుట్టూ ఈ కథ నడస్తుంది. ముందుగా పుట్టాడు అనే ఒక కారణంగా పెద్ద కొడుకుకి సింహాసనం అప్పగించడం కరెక్ట్ కాదని భావించిన అక్బర్, ఆ ముగ్గురిలో తమ సమర్థతను నిరూపించుకున్న వారికే తన సింహాసనాన్ని అప్పగిస్తానని ప్రకటిస్తాడు. దాంతో ముగ్గురూ ఆ పనుల్లో నిమగ్నమవుతారు. వారి ఉసిగొల్పుతూ అంతర్గత కలహాలను సృష్టించడానికి మరికొందరు ట్రై చేస్తుంటారు.
ఈ నేపథ్యంలోనే అనుకోకుండా సలీమ్ దృష్టి అనార్కలిపై పడటం .. ఆ క్షణంలోనే ఆయన మనసు పారేసుకోవడం జరిగిపోతుంది. ఈ విషయం అక్బర్ ను బాధిస్తుంది. ఒక వైపు నుంచి బయటి శత్రువుల పన్నాగాలు .. మరో వైపున ముగ్గురు కొడుకుల మధ్య గొడవలు .. అంతఃపుర కలహాలు ..ఇంకో వైపున అనార్కలి వ్యవహారం ఇలా అనేక కోణాల్లో ఈ కథ నడుస్తుంది. కథ – స్క్రీన్ ప్లే .. ప్రత్యేకంగా వేసిన కొన్ని సెట్స్ .. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కాస్ట్యూమ్స్ .. పోరాట సన్నివేశాలు .. భారీతనం .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. సినిమాటోగ్రఫీ ఈ వెబ్ సిరీస్ కి ప్రధానమైన బలంగా నిలిచాయని చెప్పచ్చు.