Sunday, January 19, 2025
Homeసినిమాతమిళంలో ఆహా

తమిళంలో ఆహా

Tamil Aha: తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా 100% రోజు రోజుకీ గ‌ణ‌నీయంగా త‌న ప్రభావాన్ని పెంచుకుంటూ తెలుగు వారి హృద‌యాల్లో సుస్థిర‌మైన స్థానాన్ని ద‌క్కించుకుంది. 100% ఎంటైర్‌టైన్మెంట్‌ను అందిస్తామ‌నే మాట‌ను నిల‌బెట్టుకుంటూ వ‌స్తోన్న ఆహా ఇప్పుడు అన్ని ప్రాంతీయ భాషల్లో అడుగు పెట్టబోతోంది. మొదటగా 100% తమిళ కంటెంట్ ను అందిస్తామని హామీ ఇస్తూ ఆహా తమిళ్ ను టీమ్ ఆవిష్కరించింది. తమిళ సంవత్సరాది సందర్భంగా నిన్న ఏప్రిల్ 14న చెన్నైలో జరిగిన కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఈ యాప్ ను ఆవిష్కరించారు. తమిళ హీరో శింబు, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ లు, భాగ్య రాజా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆహా ప్రమోటర్లు అల్లు అరవింద్, జూపల్లి రాము తదితరులు పాల్గొన్నారు.

తమిళ సినీ రంగానికి చేసిన సేవలకు గాను నటి  ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, శ్రీదేవి, ముత్తు రామన్, భారతీరాజా, బాలచందర్, మయప్పన్,  విశ్వనాథన్ లకు కరుణానిధి పేరిట అవార్డులు అందజేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్