Two Stars: తమిళ సినీహీరో విజయ్ బుధవారం నాడు ప్రగతి భవన్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విజయ్ ని సిఎం కెసిఆర్ శాలువాతో సన్మానించారు.
విజయ్ కధానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్, పరమ్ వి పొట్లూరి, పెరల్ వి పొట్లూరి సంయుక్తంగా భారీ స్థాయిలో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రష్మికా మందన్న కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసరాల్లో జరుగుతోంది. విజయ్ 66వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో సీనియర్ స్టార్లు శరత్ కుమార్, ప్రభు, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, జయసుధ కూడా నటిస్తున్నారు.
దర్శకుడు వంశీతో కలిసి విజయ్ ప్రగతి భవన్ కు చేరుకున్నారు. ఆయనకు ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ సాదరంగా స్వాగతం పలికి సిఎం వద్దకు తోడ్కొని వెళ్ళారు. విజయ్, కేసిఆర్ లు కాసేపు రాజకీయ, సినీ అంశాలపై చర్చించారు.
Also Read : సంక్రాంతి బరిలో దళపతి విజయ్-వంశీ పైడిపల్లి మూవీ