Sunday, January 19, 2025
Homeసినిమా'ప్రాజెక్ట్ కే' పై తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

‘ప్రాజెక్ట్ కే’ పై తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో రూపొందుతున్న పాన్ వరల్డ్ మూవీ ‘ప్రాజెక్ట్ కే’. దీనిలో  ప్రబాస్ కు జంటగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకొనే నటిస్తుండగా, బిగ్ బి అమితాబ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా యూనివర్శిల్ హీరో కమల్ హాసన్  ఈ ప్రాజెక్ట్ లో చేరారు. ఇప్పటివరకు రాని కథతో గ్లోబల్ మూవీగా దీన్ని రూపొందిస్తున్నామని మేకర్స్ చెబుతున్నారు.

ఈ మూవీ బడ్జెట్ 500 కోట్లు అనుకున్నారు కానీ.. ఇప్పుడు ఈ బడ్జెట్ 600 కోట్లకు చేరిందని టాక్ వినిపిస్తుంది. రెమ్యూనరేషన్స్ రూపంలోనే 250 కోట్ల వరకు ఖర్చు అవుతుందట. 350 కోట్లు ప్రొడక్షన్ కాస్ట్ అవుతుందట. టోటల్ గా 600 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందుతుండడంతో దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. యు.ఎస్ లో భారీ ఈవెంట్ ద్వారా ఈ మూవీ టైటిల్ అనౌన్స్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈవిధంగా హాలీవుడ్ దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేయాలనేది మేకర్స్ ప్లాన్.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా గురించి సీనియర్ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇంతకీ ఏం చెప్పారంటే.. ప్రాజెక్ట్ కే చిత్రాన్ని కరెక్ట్ గా ప్రొజెక్ట్ చేసి సరైన టైమ్ లో రిలీజ్ చేసి మార్కెట్ చేస్తే ఖచ్చితంగా ఈ మూవీ గ్లోబల్ ప్రాజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందన్నారు. ప్రపంచంలో హాలీవుడ్ ని సైతం షాక్ కి గురిచేసే విధంగా ఈ చిత్రం ఉంటుందని.. హాలీవుడ్ మూవీస్ టాప్ 50 సినిమాల జాబితా లో కలెక్షన్స్ పరంగా చేరే ఛాన్స్ ఈ చిత్రానికి ఉందన్నారు. అలాగే మొదటి రోజు ఖచ్చితమైన ప్రణాళికతో రిలీజ్ చేస్తే 500 నుంచి 600 కోట్ల వరకు కలెక్ట్ చేసే ఛాన్స్ ఉందని చెప్పారు. తమ్మారెడ్డి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అయ్యాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్