Sunday, January 19, 2025
Homeసినిమానాగబాబు, రాఘవేంద్రరావుకు గట్టిగా కౌంటర్ ఇచ్చిన తమ్మారెడ్డి

నాగబాబు, రాఘవేంద్రరావుకు గట్టిగా కౌంటర్ ఇచ్చిన తమ్మారెడ్డి

ఆర్ఆర్ఆర్ మూవీ బాక్సాఫీస్ దగ్గర 1200 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. గ్లోబల్ అవార్డ్ గెలుచుకుని చరిత్ర సృష్టించింది. ఇప్పుడు ఆస్కార్ బరిలో నిలవడం ద్వారాను చరిత్ర సృష్టించింది. అయితే.. ‘ఆర్ఆర్ఆర్’ యూనిట్ ఆస్కార్ కోసం 80 కోట్లు ఖర్చు పెట్టిందని.. అదే 80 కోట్లతో ఓ పది చిన్ని సినిమాలు చేయచ్చు అంటూ తమ్మారెడ్డి భరద్వాజ కామెంట్ చేయడం వివాదస్పదం అయ్యింది. దీనికి నాగబాబు స్పందిస్తూ…  80 కోట్లు ఖర్చు నీ అమ్మ మొగుడు పెట్టాడారా అంటూ మెగా బ్రదర్ నాగబాబు ప్రశ్నించడం మరింత వివాదానికి కారణమైంది.

అలాగే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కూడా నీ దగ్గర లెక్కలు ఏమైనా ఉన్నాయా అని అడిగారు. దీంతో మరింతగా ముదురుతున్న ఈ వివాదం పై దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తీవ్రంగా స్పందించారు. ఆ సినిమాకు సంబంధించి తాను అనని మాటలను అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారంటూ క్లారిటీ ఇచ్చారు. ముందుగా తాను తప్పు చేయలేదని… మూడు గంటల వర్క్ షాప్ లో చాలా విషయాలు మాట్లాడామని ఆర్ఆర్ఆర్ సినిమా దేశానికి గర్వకారణం అని కూడా ఈ అంశం జరగడానికి రెండు రోజులు ముందే చెప్పానని అన్నారు.

రాజమౌళి గారికి హ్యాట్సాఫ్ చెప్పాను కానీ అది మాత్రం బయటికి రాలేదని అన్నారు. నేను మాట్లాడిన మూడు గంటల వర్క్ షాప్ లో నిమిషం వీడియో తీసుకుని తను ఏదో అనేసినట్లుగా అనవసరమైన మాటలు ట్రోలింగ్స్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మీ అమ్మ మొగుడని అంటాడు ఒకడు… మా అమ్మ మొగుడు నాకు మర్యాద నేర్పించాడు.. సంస్కారం నేర్పించాడు… నాకు నీతిగా బతకడం నేర్పించాడు.. నిజం చెప్పడం నేర్పించాడు… నిజం చెప్పి నిజంగా బతకడం నేర్పించాడు.. మరి నీకు నేర్పించారా? అని ప్రశ్నించారు. నేను కూడా చాలా బూతులు మాట్లాడొచ్చు కానీ.. అలా మాట్లాడాలని అనుకోవడం లేదు అన్నారు. మొత్తానికి ఈ వివాదం మరింత ముదురుతుంది.. మరి.. ఎటు వైపు వెళుతుందో.? ఎలా ఎండ్ అవుతుందో..?

Also Read : తమ్మారెడ్డి వ్యాఖ్యలపై నాగబాబు, దర్శకేంద్రుడి కౌంటర్లు

RELATED ARTICLES

Most Popular

న్యూస్