Saturday, January 18, 2025
HomeTrending Newsసిఎంతో టాటా సన్స్ ఛైర్మన్ భేటీ

సిఎంతో టాటా సన్స్ ఛైర్మన్ భేటీ

టాటా సన్స్‌ చైర్మన్‌ నటరాజన్‌ చంద్రశేఖరన్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లి లోని అయన నివాసంలో కలుసుకున్నారు.  ఏపీలో పెట్టుబడులు, అవకాశాలపై సిఎంతో చర్చించారు. రాష్ట్రంలో పారిశ్రామికంగా అనుసరిస్తున్న పారదర్శక విధానాలను వివరిస్తూ,  ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్దంగా ఉన్నామని సిఎం వివరించారు. సుశిక్షితులైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని సిఎం జగన్ చంద్రశేఖరన్ కు తెలిపారు.

ఈ సమావేశంలో పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, వాణిజ్యం, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, పరిశ్రమల శాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికాల్‌ వలవెన్, ఏపీఈడీబీ సీఈవో జవ్వాది సుబ్రహ్మణ్యం,  సీఎంవో అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్