They are: కోనసీమ అల్లర్ల కేసులో ఇప్పటివరకూ 17మందిని అరెస్టు చేస్తే వారంతా తెలుగుదేశం , జనసేన, బిజెపి కార్యకర్తలేనని రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత వెల్లడించారు. దీన్ని బట్టి అల్లర్ల వెనుక ప్రణాళిక అంతా ఆ మూడు పార్టీలదేనన్న విషయం స్పష్టంగా అర్ధమవుతోన్దన్నారు. కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టాలని ఆ పార్టీలూ డిమాండ్ చేశాయని, రిలే నిరాహార దీక్షలు చేసినవారికి మద్దతు పలికారని, కానీ ఇప్పుడు మాట మారుస్తున్నారని ఆమె విమర్శించారు. ఈ అల్లర్ల వెనుక ఎవరున్నా కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.సామాజిక న్యాయ భేరీ- జయహో జగనన్న’ పేరిట మంత్రులు, ప్రజాప్రతినిధులు చేపట్టిన బస్సు యాత్ర విశాఖలో రెండోరోజు ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు.
పవన్, చంద్రబాబులు ముందు ఒకమాటం, వెనుక మరోమాట మాట్లాడుతున్నారని వనిత ఆరోపించారు. అమలాపురం ఘటన వైసీపీయే చేయినచిందంటూ టిడిపి అధినేత చంద్రబాబు వ్యాఖ్యలను ఆమె ఖండించారు. ఆరోపణలు చేయడం సులభమేనని, కానీ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం బాబు లాంటి సీనియర్ నేతకు తగదన్నారు. మా మంత్రి, మా ఎమ్మెల్సీ ఇళ్ళను తగలబెట్టుకోవాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు.
అమలాపురంలో తమ పార్టీ ఎమ్మెల్సీ తప్పు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నామని, ఏ విషయంలోనైనా తప్పు చేసిన ఏ ఒక్కరినీ ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు.
Also Read : పోలీసులపై విమర్శలా? : వనిత ఆగ్రహం