Monday, June 17, 2024
HomeTrending NewsTDP: 'న్యాయానికి సంకెళ్ళు' తో నిరసన

TDP: ‘న్యాయానికి సంకెళ్ళు’ తో నిరసన

తెలుగుదేశం పార్టీ అధినేత  చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను నిరసిస్తూ ఆ పార్టీ ‘న్యాయానికి సంకెళ్లు’’ పేరిట  ఆందోళన కార్యక్రమం నిర్వహించింది. ఈ సాయంత్రం ఏడు గంటల నుంచి ఐదు నిమిషాలపాటు చేతికి సంకెళ్ళు వేసుకొని ఆ వీడియో ను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయాలని పిలుపు ఇచ్చింది.

రాజమండ్రిలో జరిగిన కార్యక్రమంలో నారా భువనేశ్వరి, హైదరాబాద్ లో నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులు, విశాఖలో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చేన్నాయుడు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నేతలు ఈ ఆందోళనా కార్యక్రమంలో పాల్గొని బాబుకు సంఘీభావం తెలియజేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్