Saturday, January 18, 2025
HomeTrending Newsఅది ఎందుకు పంపలేదు?: కొడాలి

అది ఎందుకు పంపలేదు?: కొడాలి

తెలుగుదేశం ఒక ఫేక్ పార్టీ అని, పోర్న్ వీడియోలతో బాబు గలీజు రాజకీయం చేస్తున్నారని మాజీ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని) మండిపడ్డారు. ఎడిట్ చేసిన వీడియోను మరో ఫోన్ లో రికార్డు చేస్తే.. ఒరిజినల్ ఎలా అవుతుందని ప్రశ్నించారు. మాధవ్‌ వీడియోను తాము అమెరికాలో ఉన్న ఒక ల్యాబ్‌కు పంపామని… అది ఒరిజినల్‌ అని తెలుగుదేశం నేతలు చెబుతున్నారని, మరి ఓటుకు కోట్లు కేసులో వీడియోను అమెరికా ల్యాబ్ కు ఎందుకు పంపలేదని నిలదీశారు. ‘మనవాళ్ళు బ్రీఫ్డ్ మీ’ అని మాట్లాడిన చంద్రబాబు మాటలు ఆయనవో కాదో ఎందుకు టెస్ట్ చేయించలేదని అడిగారు. రాష్ట్రంలో ఏది జరిగినా, దాన్ని జగన్‌ కు అంటగట్టి ప్రభుత్వంపై నిందలు వేసే ప్రయత్నం నిత్యం జరుగుతోందని, రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందంటూ కొన్ని మీడియా సంస్థలు పదే పదే విష ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.

అది ఒరిజినల్‌ వీడియో కాదని అనంతపురం ఎస్పీ చెప్పారని, దాన్ని ఎడిట్‌ చేసి ఒక బాడీ, ఒక తలకాయ కలిపి ఎడిట్‌ చేసిన తర్వాత దాన్ని మరో ఫోన్‌లో రికార్డు చేసి సోషల్‌ మీడియాలో వదిలారని చెప్పారు. ఎడిట్‌ చేయక ముందుది,  ఒరిజినల్‌ వీడియో వస్తేనే ఆ బాడీ ఎవరిది? తల ఎవరిది? అన్నది తెలుస్తుందని వివరించారు. అసలు ఈ వీడియోను  తెలుగుదేశం పార్టీలోనే ఎడిట్ చేసి ఉంటారని కొడాలి అనుమానం వ్యక్తం చేశారు.

తెలుగుదేశం పార్టీ చరిత్ర ముగిసిందని, తెలంగాణలో లేదని…ఇక్కడ కూడా పూర్తిగా వచ్చే ఎన్నికల్లో కనుమరుగు అవుతుందని జోస్యం చెప్పారు. 2024లోనూ టీడీపీకి ఓటమి తప్పదని తెలిసే వారు అమెరికా నుంచి ఇలాంటి సర్టిఫికెట్లు తెచ్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. టిడిపి ఇప్పుడు తెలుగు లింగ పరిశోధన పార్టీ (టీఎల్‌పీ)గా మారిందని తీవ్రంగా వ్యాఖ్యానించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్