తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభ నుంచి వాకౌట్ చేశారు. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు చిత్తశుద్దితో కృషి చేస్తున్నామని తన ప్రసంగంలో గవర్నర్ పేర్కొన్నారు. పోలవరం, పూల సుబ్బయ్య వెలిగొండ, రాయలసీమ ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు.
మొత్తం 54 ప్రాజెక్టుల్లో 14 ఇప్పటికే పూర్తయ్యాయని, మరో రెండు పాక్షికంగా పూర్తయ్యాయని, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయని వివరించారు. రాబోయే నాలుగేళ్ళలో దశలవారీగా ఈ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నామని గవర్నర్ వెల్లడించారు. ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో పోలవరం సవరించిన అంచనాలు తమ ప్రభుత్వం సమర్పించిందని, ఇది జాతీయ ప్రాజెక్టు కాబట్టి త్వరగా నిధులు విడుదల చేయాలని కోరామని వివరించారు. ఈ సమయంలో తెలుగుదేశం సభ్యులు నినాదాలు చేస్తూ కాసేపు అంతరాయం కలిగించారు, గవర్నర్ ప్రసంగాన్ని మధ్యలోనే బాయ్ కాట్ చేసి వెళ్ళిపోయారు.
Also Read : అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం