Friday, March 28, 2025
HomeTrending NewsAP Assembly: నిన్న మీసాలు, నేడు విజిల్: అసెంబ్లీ లో బాలయ్య

AP Assembly: నిన్న మీసాలు, నేడు విజిల్: అసెంబ్లీ లో బాలయ్య

అసెంబ్లీ సమావేశాల్లో  నేడు రెండో రోజూ తీవ్ర గందరగోళం నెలకొంది. సభ ప్రారంభం కాగానే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలు చేపట్టారు, కానీ టిటిడి సభ్యులు అడ్డుకుని చంద్రబాబు అరెస్టుపై చర్చించాలని పట్టుబట్టి స్పీకర్ పోడియంవైపు దూసుకు వెళ్ళారు. ఐదు నిమిషాలపాటు సభను వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా ఇదే తీరు కొనసాగింది. సభలోపల సెల్ ఫోన్ తో వీడియో తీసిన టిడిపి సభ్యులు కింజరాపు అచ్చెన్నాయుడు, బెందాళం అశోక్ లను ఈ సెషన్ ముగిసే వరకూ సస్పెండ్ చేశారు.

ఇదే సమయంలో టిడిపి సభ్యుడు, హీరో నందమూరి బాలకృష్ణ విజిల్ వేస్తూ నిరసన తెలిపారు.  బాబు అరెస్టుపై చర్చకు తాము ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. బాలకృష్ణ విజిల్ వేయడంపై అధికార పార్టీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బైట బజార్లో  చేయాల్సిన పనులు అసెంబ్లీలో చేస్తున్నారంటూ మండిపడ్డారు.  సభలో నిన్న మీసాలు తిప్పిన బాలయ్య నేడు విజిల్ వేయడం విమర్శలకు దారితీసింది.

వచ్చే ఎన్నికల్లో టిడిపి సింగిల్ డిజిట్ కే పరిమితమవుతుందని, బాలకృష్ణ కూడా ఓడిపోతారని అప్పుడు ఆయన విజిల్ వేస్తూ కూర్చోవడమేనని మంత్రి అంబటి వ్యాఖ్యానించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్