Saturday, November 23, 2024
HomeTrending Newsమా అభ్యర్ధుల గురించి చంద్రబాబుకు ఎందుకు?: సజ్జల

మా అభ్యర్ధుల గురించి చంద్రబాబుకు ఎందుకు?: సజ్జల

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు రాష్ట్రంలోని 175 స్థానాల్లో ఏ ఒక్కటీ గెలుచుకునే అవకాశం లేదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కుప్పంతో సహా అన్ని స్థానాల్లోనూ ఓడిపోయి- సున్నా టీడీపీగా మిగిలే పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. ఓటమికి ఏదో ఒక కారణం చెప్పడానికి వీలుగా చంద్రబాబు ముందుగానే గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేసుకుంటున్నారని అన్నారు. అత్యంత పారదర్శకంగా పాలన నడుస్తోన్న ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలకు కుట్రలు చేస్తున్నారని, తనకు వత్తాసు పలికే ఈనాడు, ఆంధ్రజ్యోతితో పాటు ఈటీవీ, ఏబీఎన్, టీవీ5 మరో తోక మీడియాలను పట్టుకుని వాటితో అభూతకల్పనల కథనాల్ని రాయించడం.. వాటిపైనే ఈయన మరోమారు ప్రెస్‌మీట్‌లు పెట్టి మాట్లాడటం చేస్తున్నారని విమర్శించారు. వీటిల్లో భాగంగా మరోవైపు మేధావుల సంఘాలంటూ ఊరూపేరులేని వ్యక్తుల్ని తీసుకొచ్చి వారికి ఏదొక పదవుల్ని తగిలించి ప్రభుత్వాన్ని విమర్శించమని చెప్పడం.. వారి నోటిమాటల్ని ప్రజాభిప్రాయంగా చిత్రీకరించాలనే ప్రయత్నాల్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారని సజ్జల పేర్కొన్నారు. ఏపీ సచివాలయం మీడియా పాయింట్‌ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు.

అధికారంలోకొచ్చిన ఏడాది తర్వాత నుంచీ ఎమ్మెల్యేల పనితీరుపై జగన్‌ చెబుతూనే ఉన్నారని,  రేపటి ఎన్నికలకు సంబంధించి ప్రజల మేలుకు అవసరమైన సమర్ధమైన నాయకులతో బరిలోకి దిగబోతున్నామని తెలిపారు. వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థుల మార్పుపై చంద్రబాబు మాట్లాడటం ఎందుకని, ఆయనకేం హక్కుందని మాట్లాడుతాడని, అసలు,  బాబు, ఆయన కొడుకు బీసీ సీట్ల కు ఎందుకు వెళ్ళారని, చంద్రగిరిని వదిలి కుప్పానికి ఎందుకెళ్లారని ప్రశ్నించారు.

అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ఎలాంటి కుట్రలకైనా దిగే మనస్తత్వం చంద్రబాబుదని, ఒక పక్కన పచ్చమీడియాతో ప్రభుత్వ పాలనపై విషాన్ని చిమ్మడం, ఆ చిమ్మిన విషాన్ని ప్రజల్లోకి ప్రచారం చేయడం చేస్తూనే ఉన్నామని, మరోపక్కన వైఎస్‌ఆర్‌సీపీ మద్ధతుదార్ల ఓట్లుతో పాటు న్యూట్రల్‌ ఓట్లను కూడా తొలగింపునకు చంద్రబాబు అండ్‌ కో కుట్రలు చేస్తుందని సజ్జల ఆరోపించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్