Sunday, February 23, 2025
HomeTrending Newsఆదిరెడ్డి భవానీకి ధైర్యం చెప్పిన బాబు

ఆదిరెడ్డి భవానీకి ధైర్యం చెప్పిన బాబు

రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీని తెలుగుదేశం పార్టీ అధినేత  చంద్రబాబు నాయుడు పరామర్శించారు. జగజ్జనని చిట్ ఫండ్ లో అక్రమాలు జరిగాయంటూ ఆ కంపెనీ యజమానులు….  భవానీ భర్త, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి వాసు, ఆయన తండ్రి ఆదిరెడ్డి అప్పారావులను  గత వారం సిఐడి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు ఈ సాయంత్రం ఆదిరెడ్డి నివాసానికి చేరుకొని భవానీ, ఇతర కుటుంబ సభ్యులను కలుసుకుకొని ధైర్యం చెప్పారు. టిడిపి అండగా ఉంటుందని, న్యాయపోరాటానికి సహకరిస్తామని బాబు భరోసా ఇచ్చారు.

బాబు వెంట భవానీ బాబాయి, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కాయింజరాపు అచ్చెన్నాయుడు , భవానీ సోదరుడు, ఎంపి కింజరాపు రామ్మోహన్ నాయుడు, సినియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీమంత్రి పితాని. ఇతర నేతలు ఉన్నారు. పెద్దఎత్తున కార్యకర్తలు కూడా అక్కడకు చేరుకొని ఆమెకు సంఘీభావం తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్