Sunday, February 23, 2025
HomeTrending Newsద్రౌపది ముర్మును కలవనున్న చంద్రబాబు

ద్రౌపది ముర్మును కలవనున్న చంద్రబాబు

Murmu Tour: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ సాయంత్రం విజయవాడలో ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్మును కలవనున్నారు.  ఎన్నికల ప్రచార పర్యటనలో భాగంగా ద్రౌపది ముర్ము ఈరోజు అమరావతిలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం రానున్న ముర్ము నేరుగా సిఎం జగన్ నివాసానికి చేరుకుంటారు. అక్కడ తేనీటి విందు అనంతరం తాడేపల్లిలోని సీకే కన్వెన్షన్ సెంటర్ లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో ముర్ము సమావేశమవుతారు. సిఎం జగన్ తమ పార్టీ ప్రజా ప్రతినిధులను ముర్ముకు పరిచయం చేశారు. అనంతరం ఆమె గేట్ వే హోటల్ కు చేరుకొని టిడిపి నేతలతో సమావేశమై  ఆ తర్వాత తిరిగి పయనమవుతారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్