Sunday, February 23, 2025
HomeTrending NewsTDP: బాబు అరెస్టుపై అసెంబ్లీలో పోరాటం

TDP: బాబు అరెస్టుపై అసెంబ్లీలో పోరాటం

రేపటినుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఈ విషయాన్నీ ఆ పార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ప్రకటించారు.  టిడిపి శాసనసభాపక్ష సమావేశం ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగింది, ఎమ్మెల్యేలు,  ఎమ్మెల్సీలు , సీనియర్ నేతలు హాజరయ్యారు. ఢిల్లీ  పర్యటనలో ఉన్న నారా లోకేష్ వర్చువల్ గా  ఈ భేటీలో పాల్గొన్నారు. బాబు అరెస్ట్ నేపథ్యంలో సభకు హాజరు కావాలా వద్దా అనే విషయమై పార్టీ నేతల్లో భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. చివరకు సభకు హాజరై  చంద్రబాబును  అరెస్టు అంశాన్ని ప్రస్తావించాలని  తీర్మానించారు.

ప్రజల కోసం ఎన్ని అవమానాలైనా భరిద్దామని, స్కిల్ డెవలప్మెంట్ కేసులో అసలు విషయాన్ని సభా సాక్షిగా ప్రజలకు వివరించాలని లోకేష్ వ్యాఖ్యానించినట్లు తెలిసింది.  అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే బైటకు వచ్చి ప్రజల్లో పోరాటం చేస్తామని టిడిపి నేతలు వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్