కరోనా బాధితులకు ప్రభుత్వం సాయం అందించాలన్న డిమాండుతో టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా దీక్షలు చేపడుతోంది. రేపు జూన్ 29న ‘సాధన దీక్ష’ పేరుతో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో దీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు టీడీపీ అధినాయకత్వం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి దీక్షలో పాల్గొననున్నారు.