Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో జరిగిన డ్రామాపై వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు న్యాయస్తానాన్ని ఆశ్రయిస్టున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. మునుగోడు ఎన్నికల నేపథ్యంలో జరిగిన ఈ వ్యవహారంపై కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘానికి సైతం ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలోనే ఈ డ్రామాకు తెరదీశారని పేర్కొన్న బండి సంజయ్ కుమార్. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు కోరాలని డిమాండ్ చేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలోనే ఈ డ్రామా అంతా జరిగిందని… బీజేపీని అకారణంగా బదనాం చేసేందుకు యత్నించిన సదరు పోలీస్ కమిషనర్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మునుగోడు ఎన్నికల్లో మునిగిపోతామనే భయంతో కేసీఆర్ వేసిన ఇలాంటి చిల్లర డ్రామాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

ఈరోజు మునుగోడు క్యాంప్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎంపీ ధర్మపురి అరవింద్, ఎన్నికల స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ జి.వివేక్ వెంకటస్వామి, జాతీయ కార్యవర్గ సభ్యులు ఎన్.ఇంద్రసేనారెడ్డి, మాజీమంత్రి చంద్రశేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు దుగ్యాల ప్రదీప్ కుమార్, ఉపాధ్యక్షులు డాక్టర్ మనోహర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి, అధికార ప్రతినిధులు సీహెచ్.విఠల్, ఎన్వీ సుభాష్, జె.సంగప్ప తదితరులతో కలిసి బండి సంజయ్ కేసీఆర్ 8 ఏళ్ల పాలనలో జరిగిన తప్పిదాలు, అక్రమాలను వివరిస్తూ టీఆర్ఎస్ పై బీజేపీ ఛార్జ్ షీట్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేల కొనుగోలు పేరుతో కేసీఆర్ డ్రామాలను ఎండగట్టారు.

Mlas Purchase Money

అందులోని ముఖ్యాంశాలు..

• నవంబర్3న మునుగోడు ఉప ఎన్నిక జరగబోతోంది. ఏ ఎన్నిక జరిగినా పోటీ చేయబోయే అభ్యర్థులు, నియోజకవర్గానికి ఏం చేశారు? ఏం చేయబోతున్నారనే అంశాలను స్పష్టం చేయాలి.

• మునుగోడు ఉప ఎన్నిక ఎందుకొచ్చిందో ప్రజలకు తెలుసు. మరో ఏడాదికిపైగా సమయం ఉన్నా.. కేసీఆర్ మూర్ఖత్వపు పాలన, అనాలోచిత నిర్ణయాలు, దుర్మార్గపు ఆలోచనలు, కక్ష్యపూరిత ధోరణి, ఈర్ష్యాద్వేషాలతో వ్యవహరిస్తూ మునుగోడును పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో రాజీనామా చేశారు.

• కేసీఆర్ ఫాలనలో చేసిన తప్పిదాలపై రూపొందించిన ఛార్జ్ షిటీ ను రూపొందించాం.

• నకల్ కొట్టడానికి అకల్ ఉండాలే… అది కూడా కేసీఆర్ కు లేదు.. ఎమ్మెల్యేల కొనుగోలు అంతా ఓ డ్రామా?

• ఎఫ్ఐఆర్ నమోదై 12 గంటలు దాటింది. ఇంతవరకు వివరాల్లేవు. ప్రగతి భవన్ లో ఇంకా స్క్రిప్ట్ రడీ కాలేదేమో. మిమిక్రీ అర్టిస్టులు రాలేదేమో..

• ఒక్క ఉప ఎన్నిక గెలిచేందుకు ఇంత డ్రామా ఎందుకు?

• మీడియా సైతం వాస్తవాలను బయటపెట్టాలి. దీనివెనుక ఉన్న కుట్రలను చేధించాలి. కానీ దురద్రుష్టవశాత్తు రెండు, మూడు ఛానళ్లు పాలకులతో కుమ్కక్కై అబద్దాలను ప్రచారం చేయడం బాధాకరం.

• ఈరోజు కాకుంటే రేపైనా వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. అప్పుడు ఆ ఛానళ్ల పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఆలోచించాలి.

• నిన్న జరిగిన డ్రామాలో ఫాంహౌజ్ వాళ్లదే… డబ్బులు తరలించింది ఎమ్మెల్యే వాహనమే. ఫిర్యాదు చేసింది వాళ్లే… బాధితులు వాళ్లే…

• డబ్బులు ఆఫర్ చేసిన గాలి గొట్టం గాళ్లు టీఆర్ఎస్ నేతల వ్యాపార భాగస్వాములు.. కేసీఆర్ కుటుంబంతోనూ వ్యాపార సంబంధాలున్నయ్. ఈ లెక్కన వాళ్లు కూడా టీఆర్ఎసోళ్లే..

• నిన్న ఎమ్మెల్యేల కొనుగోలు పేరుతో జరిగిన కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన డ్రామా. తతంగమంతా సంబంధిత పోలీస్ కమిషనర్ చేయించిన డ్రామాయే… అందుకోసం తన పరిధిలోని ప్రాంతాన్నే ఎంచుకున్నడు. ఈ ఎపిసోడ్ లో కమిషనర్ తప్పించుకోలేరు?

• తక్షణమే ఈ వ్యవహారానికి వేదికైన దక్కన్ కిచెన్ సెంటర్ సీసీ పుటేజీ బయటపెట్టాలి. ప్రగతి భవన్ కు గత వారం రోజులు నుండి ఎవరెవరు వస్తున్నారు? ఢిల్లీలో సీఎంను కలిసిన వారెవరు? పోలీస్ కమీషనర్, 4 గురు ఎమ్మెల్యేల, సూత్రధారులు, పాత్రధారుల కాల్ లిస్టుతోపాటు సీఎం క్యాంపు ఆఫీష్ ల్యాండ్ లైన్ ఫోన్ లిస్ట్ కూడా బయటపెట్టాలి.

• ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో సీఎం రాసిన స్క్క్రిప్టు బెడిసి కొట్టింది. మళ్లో కొత్త డ్రామాకు తెరదీస్తున్నరు. ప్రగతి భవన్ లో స్క్రిప్ట్ రడీ చేస్తున్నారు.

• ఎందుకంటే నిజంగా అక్కడ డబ్బులు దొరికితే… ఆ డబ్బును మీడియాకు ఎందుకు చూపలేదు? ఆ బ్యాగులో ఏముంది? బాంబులేమైనా ఉన్నాయా?

• నిన్న ఉదయం 11.26 గంటలకు ఎఫ్ఐఆర్ నమోదైతే… సాయంత్రం వరకు అనుకూలమైన 2 ఛానళ్ల వారికే సమాచారం ఇవ్వడం వెనుక మర్మమేమిటి?

• అక్కడికి వచ్చిన పోలీసాఫీసర్ తమకేమీ తెలియదని, కమీషనర్ పంపితే వచ్చామని.. బ్యాగులో డబ్బులెక్కడున్నాయని చెప్పిన మాటలను గుర్తుంచుకోవాలి.

• ఈ వ్యవహారాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మేం కోర్టును ఆశ్రయిస్తాం. సీబీఐ విచారణ కూడా జరపాలి. ఎన్నికలు జరుగుతున్నందున కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తాం. ముఖ్యమంత్రికి నిజంగా చిత్తుశుద్ధి ఉంటే తక్షణమే స్పందించాలి.

• ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామా వెనుక పెద్ద కుట్ర ఉంది. దీనిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు… రేపు ఉదయం 9 గంటలకు యాదాద్రి లక్ష్మీనర్సింహాస్వామి వద్దకు నేనొస్తున్నా… కేసీఆర్… నీకు ఈ ఎపిసోడ్ తో సంబంధం లేదనుకుంటే… రేపు అక్కడికి రావాలి. నాతోపాటు ప్రమాణం చేయాలి. రేపు ఉదయం 9 నుండి 10 గంటలకు యాదాద్రి వద్ద ఎదురు చూస్తా.

• నీ నీచపు బుద్ది, చిల్లర వేషాలను తెలంగాణ సమాజం గమనిస్తోంది. ఒక్క ఉప ఎన్నిక గెలవడానికే ఇట్లాంటి డ్రామాలు చేస్తున్న కేసీఆర్ బీఆర్ఎస్ పేరుతో ఇంకెన్ని వేషాలు వేస్తారోనని ప్రజలు, టీఆర్ఎస్ కార్యకర్తలు నవ్వుకుంటున్నారు.

• ఎఫ్ఐఆర్ నమోదైనప్పుడు… ఎమ్మెల్యేలను విచారించడానికి పోలీస్ స్టేషన్ కు ఎందుకు తీసుకెళ్లలేదు? వాళ్ల స్టేట్ మెంట్ ఎందుకు రికార్డ్ చేయలేదు? పైగా బీజేపీ ఇదంతా చేయించినట్లుగా పోలీస్ కమీషనర్ లీక్ ఇస్తడు? సిగ్గుండాలె.. అందులో బీజేపీ వాళ్లెవరున్నరు? ఎంత ధైర్యం? వాళ్లు బీజేపోళ్లని ఎట్లా చెబుతవ్? అసలు డబ్బులేవి? ఎందుకు సీజ్ చేయలేదు? ఎందుకు ఆ డబ్బు వివరాలు బయటపెట్టలే? అందులో ఎంత సొమ్ము నొక్కేస్తున్నవ్?

• పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లాల్సిన ఎమ్మెల్యేలు ప్రగతి భవన్ కు తీసుకెళ్లి మళ్లీ సీఎం ఆధ్వర్యంలో బయట ఏం చెప్పాలో ప్రత్యేకంగా కోచింగ్ ఇస్తున్నారు. ఈరోజో రేపో మళ్లీ ప్రెస్ మీట్ పెట్టించి అబద్దాలు చెప్పించేందుకు యత్నిస్తున్నరు.

• గాలి గొట్టంగాడికి ఏ బీజేపీ నాయకులు ఫోన్ చేశారో ఎందుకు చెప్పలేదు? ఎఫ్ఐఆర్ లో బీజేపీ నాయకులు పేర్లు ఉండాలి కదా… మరి అవేవీ లేకుండా బీజేపీ పేరును ఎందుకు బదనాం చేస్తున్నరు? ఈ సమాచారాన్ని రెండు ఛానళ్లలోనే ఎందుకు వచ్చింది? ఇదంతా ఓ ప్లాన్..

• పైగా ఫుల్లుగా తాగి రోడ్డెక్కి టీఆర్ఎస్ నేతలు చేసిన డ్రామాలు చూసి జనం నవ్వుకుంటున్నరు. వాస్తవాలు రేపోమాపో బయటకు వస్తాయి. సీఎం ఇప్పటికైనా చిల్లర వేషాలు బంద్ చేయాలే. తెలంగాణ ప్రజలు పరువు తీస్తున్నరు.

Also Read : యాదాద్రిలో ప్రమాణం చేద్దామా… కెసిఆర్ కు బండి సంజయ్ సవాల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com