Saturday, November 23, 2024
HomeTrending NewsRains Alert: 48 గంటల్లో భారీ వర్షాలు, అప్రమత్తంగా ఉండండి - డీజీపీ

Rains Alert: 48 గంటల్లో భారీ వర్షాలు, అప్రమత్తంగా ఉండండి – డీజీపీ

రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున రాష్ట్రంలోని పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం జరిగిందని డీజీపీ అంజనీ కుమార్ తెలిపారు. రానున్న 48 గంటలలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో చేపట్టాల్సిన ముందుజాగ్రత్త చర్యలపై పోలీస్ కమీషనర్లు, ఎస్. పి లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శాంతి భద్రతల విభాగం అదనపు డీజీ సంజయ్ కుమార్ జైన్ కూడా పాల్గొన్న ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డీజీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ పోలీస్ యంత్రాంగం 24గంటలు అందుబాటులో ఉంటారని సహాయం కోసం డయల్100 కి లేదా స్థానిక పోలీసు పోలీసులకు గానీ సమాచారం అందిన వెంటనే తగు సహాయక చర్యలు చేపట్టడం జరుగుతుందని స్పష్టం చేశారు.

ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు పూర్తిగా నిండాయని, ఈ జలాశయాల వద్దకు ఎవరు వెళ్లకుండా తగు ముందు జాగ్రత చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. వరద ఉదృతితో తెగిపోయిన రోడ్లు, ఉదృతంగా ప్రవహించే కాజ్ వే ల వద్దకు ప్రజలు వెళ్లకుండా, రెండు దిక్కులా ప్లాస్టిక్ కోన్స్,బారిగేడ్స్, హెచ్చరిక గల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తగా ట్రాఫిక్ డైవర్షన్ చేయాలని ఆదేశించారు. భద్రర్ది కొత్తగూడెం జిల్లాలో చర్ల లోని లోతట్టు ప్రాంతాలలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగిందని తెలిపారు.

అత్యవసర పరిస్థితుల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఉపయోగించుకోవాలన్నారు. రైతులు పొలాల్లో విద్యుత్ మోటార్ల వద్ద జాగ్రత్తగా ఉండాలి,వర్షాలు పడేటప్పుడు విద్యుత్ స్తంభాలను గాని,వైర్లను గానీ చేతులతో తాకకుండా, ఇతర జాగ్రత చర్యలపై సమాచార మాధ్యమాల ద్వారా ప్రజలను చైతన్య పర్చాలని ఆదేశించారు. వర్షాలకు కల్వర్టు, చిన్న బ్రిడ్జి ల వద్ద నీరు ప్రవహిస్తున్నప్పుడు వాహనాలతో దాటడానికి సాహసం చేయరాదని సూచించారు. జలపాతాలు , నిండిన చెరువుల మత్తళ్ల వద్దకు ప్రజలు వెళ్లకుండా జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్