Sunday, January 19, 2025
HomeTrending Newsతెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల

తెలంగాణ ఎంసెట్ ఫలితాలను ఈ రోజు విద్యా శాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి విడుదల చేశారు. దాదాపు రెండు లక్షలకు పైగా విద్యార్థులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న తెలంగాణ ఎంసెట్ ఫలితాలు నేడు ఉదయం 11.00 గంటలకు విడుదలయ్యాయి. ఇంజనీరింగ్ లో లక్ష్మి సాయి లోహిత్ ప్రథమ ర్యాంక్ సాధించగా… సాయి దీపికకు రెండో ర్యాంక్ సాధించింది. కార్తికేయ మూడో ర్యాంక్ సాధించాడు. అగ్రికల్చర్ లో నీహా ప్రథమ ర్యాంక్ సాధించగా రోహిత్ రెండో ర్యాంక్ సాధించాడు. అగ్రికల్చర్ లో తరుణ్ కుమార్ మూడో ర్యాంక్ సాధించాడు.

తెలంగాణ ఎంసెట్ ఇంజనీరింగ్ లో 80.41 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా…ఎంసెట్ అగ్రికల్చర్ లో 88.34 శాతం మంది విద్యార్థులు  ఉత్తీర్ణత సాధించారు. విద్యార్థులు  తమ ఫలితాలను www. eamcet.tsche.ac.in వెబ్ సైట్లో చెక్ చేసుకోవచ్చు. ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్షలను గత నెల 18, 19, 20 తేదీల్లో నిర్వహించారు. అగ్రికల్చర్, మెడికల్ విభాగాలకు సంబంధించిన ఎగ్జామ్స్ జులై 30, 31 తేదీల్లో నిర్వహించారు. ఇందుకు సంబంధించిన కీని ఇటీవల విడుదల చేసిన అధికారులు.. కీపై అభ్యంతరాలను సైతం స్వీకరించారు.

ఈసెట్ ఫలితాలను మంత్రి సబితా ఇంద్రా రెడ్డి విడుదల చేశారు. పాల్ టెక్నిక్ పూర్తి అయిన విద్యార్థులు లేటరల్ ఎంట్రీ కోసం ఈసెట్ రాస్తారు. వీరికి నేరుగా బీటెక్, బీఫార్మసీ రెండో సంవత్సరంలో చేరేందుకు ఈసెట్ నిర్వహిస్తారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్