Thursday, May 29, 2025
HomeTrending NewsIntermediate Board: ఇంట‌ర్మీడియ‌ట్ అక‌డ‌మిక్ క్యాలెండ‌ర్‌

Intermediate Board: ఇంట‌ర్మీడియ‌ట్ అక‌డ‌మిక్ క్యాలెండ‌ర్‌

2023-24 విద్యా సంవ‌త్స‌రానికి గానూ తెలంగాణ ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు అక‌డ‌మిక్ క్యాలెండ‌ర్‌ను విడుద‌ల చేసింది. జూన్ 1 నుంచి ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్, సెకండియ‌ర్ విద్యార్థుల‌కు త‌ర‌గ‌తులు ప్రారంభ‌మవుతాయ‌ని తెలిపింది.

అక్టోబ‌ర్ 19 నుంచి 25వ తేదీ వ‌ర‌కు ద‌స‌రా సెల‌వుల‌ను ప్ర‌క‌టించింది. 26వ తేదీన తిరిగి కాలేజీలు తెరుచుకోనున్నాయి. న‌వంబ‌ర్ 20 నుంచి 25వ తేదీ వ‌ర‌కు హాఫ్ ఇయ‌ర్ ఎగ్జామ్స్ నిర్వ‌హించ‌నున్నారు. 2024, జ‌న‌వ‌రి 13 నుంచి 16వ తేదీ వ‌ర‌కు సంక్రాంతి సెల‌వులు ప్ర‌క‌టించింది. 17వ తేదీన ఇంట‌ర్ క‌ళాశాల‌ల త‌ర‌గ‌తులు ప్రారంభం కానున్నాయి. జ‌న‌వ‌రి 22 నుంచి 29 వ‌ర‌కు ప్రీ ఫైన‌ల్ ఎగ్జామ్స్ నిర్వ‌హించ‌నున్నారు. ఫిబ్ర‌వ‌రి రెండో వారంలో ప్రాక్టిక‌ల్స్, మార్చి మొద‌టి వారంలో వార్షిక ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఇంట‌ర్ బోర్డు ప్ర‌క‌టించింది.
RELATED ARTICLES

Most Popular

న్యూస్