Saturday, November 23, 2024
HomeTrending Newsశాసనసభ సమావేశాలకు సన్నద్ధం

శాసనసభ సమావేశాలకు సన్నద్ధం

తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పోలీసు శాఖ అధికారులతో శాసనసభ భవనంలోని కమిటీ హాల్ లో  ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించిన శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి, శాసనమండలి ప్రోటెం చైర్మన్ వెన్న భూపాల్ రెడ్డి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, శాసనసభలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, లెజిస్లేటివ్ సెక్రటరీ డా. వి.  నరసింహా చార్యులు..

ఈసందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ…

తెలంగాణ రాష్ట్రంలో కరోనాను సమర్ధవంతంగా అరికట్టడంలో కృషి చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, అధికారులకు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బందికి అభినందనలు, ధన్యవాదాలు. రేపటి నుండి తెలంగాణ రాష్ట్ర రెండవ శాసనసభ, 8వ సెషన్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు పారదర్శకంగా జరగడానికి గత సమావేశాలలో లాగానే ప్రభుత్వం, అధికారులు సహకారం అందించాలి. గౌరవ సభ్యులు అడిగిన సమాచారం సాధ్యమైనంత త్వరగా అందించాలి.

గత సమావేశాల లాగానే ఆయా శాఖల తరుపున ప్రత్యేకంగా నోడల్ అధికారులను సభలోని బాక్స్ లో అందుబాటులో ఉంచాలి. గత సమావేశాలకు సంబంధించిన పెండింగులో ఉన్న ప్రశ్నలకు జవాబులు వెంటనే పంపించాలి. సమావేశాల సమయంలో కరోనా నిబంధనలను అమలు చేయడంతో పాటుగా చర్యలు తీసుకోవాలి.

సమీక్షకు హజరైన చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ (ఫైనాన్స్) రామకృష్ణారావు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ (MA &UD) అరవింద రావు, ప్రిన్సిపల్ సెక్రటరీ (GAD) వికాస్ రాజ్, హెల్త్ సెక్రటరీ రిజ్వీ, GHMC కమీషనర్ లోకేష్ కుమార్. రాష్ట్ర DGP-యం. మహేందర్ రెడ్డి, హోం ప్రిన్సిపల్ సెక్రటరీ-రవిగుప్తా, DG (SPF)-ఉమేష్ షరాఫ్, హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనర్-అంజనీ కుమార్, DG (లా & ఆర్డర్)- జితేందర్, అడిషనల్ సిపి (క్రైం)-షీకా గోయల్, జాయింట్ సిపి(సెంట్రల్ జోన్) – విశ్వ ప్రసాద్,  సైబరాబాద్ పోలీసు కమీషనర్- స్టిఫెన్ రవీంద్ర, అడిషనల్ సిపి (రాచకొండ)-సుదీర్, DIG (ఇంటలిజెన్స్)- శివకుమార్, ఇంచార్జి DIG (ISW)-తప్సిన్ ఇక్బాల్, DCP (ట్రాఫిక్) – భాస్కర్,  రీజనల్ ఫైర్ ఆఫీసర్- పాపయ్య, అసెంబ్లీ ఛీఫ్ మార్షల్- కర్ణాకర్.

RELATED ARTICLES

Most Popular

న్యూస్