Sunday, February 23, 2025
HomeTrending Newsతెలంగాణ విద్యార్థుల‌ను ఆదుకోండి..కేటీఆర్

తెలంగాణ విద్యార్థుల‌ను ఆదుకోండి..కేటీఆర్

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థుల‌ను ఆదుకోవాల‌ని కోరుతూ విదేశాంగ శాఖ మంత్రి జైశంక‌ర్‌కు రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. విద్యార్థుల‌ను స్వ‌దేశానికి ర‌ప్పించేందుకు ప్ర‌త్యేక విమానాల‌ను ఏర్పాటు చేయాల‌ని కేంద్రానికి కేటీఆర్ విజ్ఞ‌ప్తి చేశారు. విద్యార్థుల పూర్తి ప్ర‌యాణ ఖ‌ర్చుల‌ను భ‌రించ‌డానికి తెలంగాణ‌ ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.


ఉక్రెయిన్‌లోని తెలంగాణ విద్యార్థుల‌ను ఆదుకునేందుకు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఢిల్లీలోని తెలంగాణ భ‌వ‌న్‌, రాష్ట్ర సచివాల‌యంలో హెల్ప్ లైన్ నంబ‌ర్ల‌ను ఏర్పాటు చేసింది. ఎప్ప‌టిక‌ప్పుడు విదేశాంగ శాఖ అధికారుల‌తో సీఎస్ సోమేశ్ కుమార్ సంప్ర‌దింపులు జ‌రుపుతున్నారు. హెల్ప్ లైన్ సెంట‌ర్ల‌కు రాత్రి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 75 ఫోన్ కాల్స్ వ‌చ్చిన‌ట్లు సీఎస్ వెల్ల‌డించారు. తెలంగాణ విద్యార్థుల‌కు అవ‌స‌ర‌మైన భ‌రోసా ఇస్తున్నామ‌ని తెలిపారు. ఢిల్లీలోని తెలంగాణ భ‌వ‌న్ హెల్ప్ లైన్ నంబ‌ర్ – 70425 66955, 99493 51270, 96456 63661

Also Read : రష్యా చక్రబంధంలో ఉక్రెయిన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్