Saturday, January 18, 2025
Homeసినిమాపునీత్ మృతి పట్ల తెలుగు పరిశ్రమ దిగ్భ్రాంతి

పునీత్ మృతి పట్ల తెలుగు పరిశ్రమ దిగ్భ్రాంతి

Telugu Film Industry Grief Over The Sudden Demise Of Puneeth Raj Kumar :

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం పట్ల తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. నటీనటులు, సాంకేతిక నిపుణులు, దర్శక నిర్మాతలు, జర్నలిస్టులు పునీత్ తో తమ కున్న సంబంధాన్ని నెమరు వేసుకుంటూ అయన ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. అయన కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే శక్తి ఇవ్వాలని ప్రార్ధించారు.

రెబల్ స్టార్ కృష్ణం రాజు పునీత్ మృతిపై విచారం వ్యక్తం చేశారు. రాజ్ కుమార్ తనకు ఆప్త మిత్రుడని, అయన కుమారుడిగా పునీత్ బాగా తెలుసని, ఇంత చిన్న వయసులో ఇలా జరగడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.

ఇది నా హృదయాన్ని ముక్కలు చేసే విషయం, పునీత్ మృతి భారత, కన్నడ చలన చిత్ర రంగాలకు తీరని లోటు, ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యం భగవంతుడు వారి కుటుంబ సభ్యులకు ఇవ్వాలి – చిరంజీవి

పునీత్ ఇక లేరనే విషయాన్ని నేను నమ్మలేకపోతున్నా, తన నటనతో లక్షలాది మంది అభిమానులను  సొంతం చేసుకున్నారు. కన్నడ సినిమా కింగ్ వెళ్ళిపోయారు – నందమూరి బాలకృష్ణ, హీరో, ఎమ్మెల్యే

పునీత్ మరణ వార్త నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం – నాగార్జున

పునీత్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా, దేవుడు కొన్నిసార్లు ఇలా ఎందుకు చేస్తాడో అర్థం కాదు- మోహన్ బాబు

పునీత్ మరణవార్త నన్ను కలచివేసింది, వారి కుటుంబ సభ్యులు, అభిమానులు, స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతి – ఆర్కే రోజా, నటి, ఎమ్మెల్యే

పునీత్ తుది శ్వాస విడిచారనే వార్త తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. నమ్మశక్యం కాలేదు. అయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను – పవన్ కళ్యాణ్

పునీత్ మరణవార్త తెలిసి షాక్ అయ్యాను, నేను కలుసుకున్న గొప్ప వ్యక్తుల్లో అయన ఒకరు – మహేష్ బాబు

నా హృదయం ముక్కలైంది, ఇంత త్వరగా వెళ్ళిపోయావంటే నమ్మలేకపోతున్నా – జూనియర్ ఎన్టీఆర్

అసాధారణ ప్రతిభ ముందే వెళ్ళిపోయింది, మీరు ఎప్పటికీ మా హృదయాల్లో ఉంటారు పునీత్ సార్ – అల్లు అర్జున్

భారత చలన చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ వ్యక్తి పునీత్ మరణం విచారకరం – జగపతిబాబు

పునీత్ మరణవార్త జీర్ణించుకోలేకపోతున్నా – సాయి కుమార్

నా హృదయం ముక్కలైంది, ఇది భావ్యం కాదు పునీత్ అన్నా – మంచు మనోజ్

ఆయన ఆత్మకు శాంతి కలగాలి – రవి తేజ

అప్పు… నేను ఎరిగిన గొప్ప వ్యక్తుల్లో ఒకడు- హీరో సిద్దార్థ్

ఇది దిగ్భ్రాంతి కలిగించిన వార్త, నిన్ను మిస్ అవుతున్నాం బ్రదర్ – సోను సూద్

నమ్మలేకపోతున్నా, నిజంగా ఈ వార్త షాక్… ఎందుకు ఇంత త్వరగా వెళ్ళిపోయారు సార్ – కీర్తి సురేష్

నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నా, గొప్ప మానవతావాది, మంచి వ్యక్తి – హన్సిక

ఇది మాటలకందని విషాదం – రకుల్ ప్రీత్ సింగ్

షాకింగ్, ఓం శాతి – ప్రణీత

నేను కలిసిన వ్యక్తుల్లో డౌన్ టు ఎర్త్ మనిషి పునీత్ – అంజలి

Must Read :పునీత్ రాజ్ కుమార్ కు గుండెపోటు

RELATED ARTICLES

Most Popular

న్యూస్