Sunday, February 23, 2025
HomeTrending Newsఆర్మీ క్యాంప్​పై ఉగ్ర దాడి.. అమరులైన ముగ్గురు జవాన్లు

ఆర్మీ క్యాంప్​పై ఉగ్ర దాడి.. అమరులైన ముగ్గురు జవాన్లు

జమ్ముకశ్మీర్​ రాజౌరీలో జరిగిన ఉగ్రదాడిలో ముగ్గురు జవాన్లు అమరులయ్యారు. ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. దర్హల్ ప్రాంతంలోని పర్గల్​లోని సైనిక శిబిరమే లక్ష్యంగా ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి తెగబడ్డారు. ఈ రోజు (గురువారం) వేకువజామున ఆర్మీ క్యాంప్​ ఫెన్సింగ్​ దాటుకుని లోపలకు చొరబడేందుకు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. వారిపై కాల్పులు జరిపారు. ఇరు వర్గాల మధ్య చాలాసేపు హోరాహోరీ పోరు జరిగింది. కాల్పుల్లో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు.
హతమైన ముష్కరుల వద్ద భారీగా ఆయుధాలు ఉన్నట్లు తెలిసింది. చుట్టుపక్కల ఇంకెవరైనా ఉన్నారన్న అనుమానంతో భద్రతా సిబ్బంది విస్తృత సోదాలు జరుపుతున్నారు

RELATED ARTICLES

Most Popular

న్యూస్