Saturday, January 18, 2025
Homeసినిమా'గాడ్ ఫాదర్' సాంగ్ ప్రోమో విడుదల

‘గాడ్ ఫాదర్’ సాంగ్ ప్రోమో విడుదల

భారతీయ చిత్రపరిశ్రమలోని ఇద్దరు మెగాస్టార్‌లు చిరంజీవి, సల్మాన్ ఖాన్‌ కలసి నటిస్తున్న ఆల్ టైమ్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘గాడ్ ఫాదర్‘ ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీ.  వీరిద్దరూ కలిసి తమ మాస్ డ్యాన్స్‌లతో ప్రభంజనం సృష్టించేందుకు తయారవుతున్నారు. ఈ చిత్రం మొదటి సింగిల్- థార్ మార్ థక్కర్ మార్ ప్రోమో విడుదలైయింది.

చిరంజీవి, సల్మాన్‌ఖాన్‌ ఇద్దరూ ఒకే రకమైన దుస్తులు ధరించి ఇద్దరూ వెండితెర ఆరాధ్య దైవాలుగా అలరించారు. ఇద్దరూ బ్లాక్ షేడ్స్ వాడటం స్టైల్ ని మరింత పెంచింది. థమన్ అద్భుతమైన మాస్ డ్యాన్స్ నంబర్‌ ని కంపోజ్ చేయగా హుక్ స్టెప్ ఖచ్చితంగా మాస్‌ను అలరిస్తోంది. భారీ సెట్‌లో ప్రభుదేవా మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ చేశారు. శ్రేయా ఘోషల్ ఈ పాటని ఆలపించగా, అనంత శ్రీరామ్ సాహిత్యం అందించారు. సెప్టెంబర్ 15న పూర్తి పాటను విడుదల చేయనున్నారు.

మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయనతార, సత్య దేవ్, సునీల్, సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్ , సూపర్ గుడ్ ఫిలింస్ బ్యానర్‌లపై ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్ ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. మాస్టర్ సినిమాటోగ్రాఫర్ నీరవ్ షా కెమెరా హ్యాండిల్ చేస్తుండగా, సురేష్ సెల్వరాజన్ ఆర్ట్ డైరెక్టర్. గాడ్ ఫాదర్ ఈ ఏడాది అక్టోబర్ 5న దసరా కానుకగా తెలుగు, హిందీలో గ్రాండ్ గా విడుదల కానుంది.

Also Read : ‘గాడ్ ఫాదర్’ నుండి సత్యదేవ్ ఫస్ట్ లుక్ విడుదల

RELATED ARTICLES

Most Popular

న్యూస్