Monday, February 24, 2025
Homeస్పోర్ట్స్Womens Asia Cup T20 2022: థాయ్ లాండ్ పై ఇండియా ఘనవిజయం

Womens Asia Cup T20 2022: థాయ్ లాండ్ పై ఇండియా ఘనవిజయం

మహిళల ఆసియా కప్ టి 20 టోర్నమెంట్ లో నేడు జరిగిన మ్యాచ్ లో థాయ్ లాండ్ పై ఇండియా అద్భుత విజయం నమోదు చేసింది. భారత బౌలర్ల ధాటికి థాయ్ లాండ్ 37కే కుప్ప కూలింది. థాయ్ జట్టులో ఓపెనర్ కొంచెరోయిన్ కై మాత్రమే రెండంకెల స్కోరు (12) చేయగలిగింది. ముగ్గురు డకౌట్ అయ్యారు. మరో ఆరుగురు సింగల్ డిజిట్ కే వెనుదిరిగారు. 15.1 ఓవర్లలో 37 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

భారత బౌలర్లలో స్నేహ్ రానా మూడు; దీప్తి శర్మ, రాజేశ్వరి గాయక్వాడ్ చెరో రెండు; మేఘనా సింగ్ ఒక వికెట్ పడగొట్టారు.

ఈ స్వల్ప లక్ష్యాన్ని భారత జట్టు ఒక వికెట్ కోల్పోయి 6 ఓవర్లలో సాధించింది. షఫాలీ 8  పరుగులు చేసి  ఔట్ కాగా, సబ్బినేని మేఘన-20; పూజా వస్త్రాకర్-12 పరుగులతో నాటౌట్ గా ఉన్నారు.

స్నేహ్ రానా కు ప్లేయర్  అఫ్ ద మ్యాచ్ దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్